Others

దళితులను ఆలయాలకు దగ్గరగా చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్పృశ్యత అనేది పూర్వం ఎక్కడా లేదు. ఇది మధ్యలో ఎప్పుడో ప్రవేశించింది. దీనికి వివిధ కారణాలు చెబుతున్నారు. కాని వాటిలోని విశ్వసనీయత అనుమానమే. దీనిని వజ్రాయుధంగా చేసుకుని మిషనరీలు చాలామంది దళితులను క్రైస్తవులుగా మార్చివేశారు. ఇలా మారినవారిలో కొందరిని మత బోధకులుగా తయారుచేశారు. అట్టివారి ఉపన్యాసాలు ఎంతో ఆవేశపూరితంగా వుంటాయి. ఈ విధంగా మిషనరీలు వారికి ఒక దేవుణ్ణి ఒక మతాన్ని ప్రసాదించారు. మత మార్పిడులు నేటికీ జరుగుతూనే వున్నాయి. ఇందుకు విదేశీ సహాయం పుష్కలంగా లభిస్తుంది. ఇపుడు అస్పృశ్యత తగ్గిపోయినట్లే. దళితులు గ్రామాలలో గల కాఫీ హోటళ్లకు వివిధ దుకాణాలకు వస్తున్నారు. వారిలో కొందరు వివిధ వృత్తులు నేర్చుకుంటున్నారు. కరెంటు పనులు చేయడానికి నీటి పంపులు, మోటార్లు ఏర్పాటు చేయడానికి ఇళ్ళల్లోకి వస్తున్నారు. రిజర్వేషన్లవల్ల ఉద్యోగాలతోపాటు రాజకీయ పదవులు కూడా కొందరు పొందుతున్నారు. పట్టణ ప్రాంతాలలోగల ఆలయాలకు యధేచ్చగా వారు వెళ్ళవచ్చు. గ్రామీణ ప్రాంతంలోనే కొంచెం ఇబ్బంది. అందువలన వారు ఆలయాలలోకి రావడానికి సంకోచిస్తున్నారు. ఒక పర్యాయం మా గ్రామంలో పంచాయితీ ఎన్నికలకు ముందు ఎవరిని బలపరచాలో చర్చించడానికి వివిధ కుల పెద్దలు సమావేశమైనారు. అది ఒక విశాలమైన ఆలయ ప్రదేశం. అంతా వచ్చారు. దళితులు మాత్రం గేటు వద్దనే కూర్చున్నారు. లోనికి రమ్మంటే రాలేదు. ఏదో ఆచారం ఉంది కదా, మేం ఇక్కడ కూర్చుంటాం, మీ మాటలు మాకు వినబడతాయి అన్నారు. వారి సమాధానం ఎంత హుందాగా ఉందో చూడండి. అది అలా ఉంచుతాం. కొన్ని దళిత వాడలలో రామాలయాలున్నాయి. అగ్రవర్ణాలు అని పిలువబడే వారు అపుడప్పుడు అక్కడకు వెళ్లాలి. గ్రామాలలోగల ఆలయాలకు దళితులు వచ్చినా ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు. పూజారులు ధర్మకర్తలు కూడా ఇందుకు సహకరించాలి. ఎన్ని చేసినా గ్రామాలలో దళితుల ఆలయ ప్రవేశం కష్టంగానే ఉంది. ప్రతి యేటా పూర్వం దళితులు గొంతెనమ్మ పండుగ చేసేవారు. ఆ సందర్భంలో విచిత్ర వేషాలు వేసేవారు. గొంతెనమ్మ దేవతని ఊరేగించేవారు. మత మార్పిడులవలననో మరే కారణం చేతనో అట్టి ఉత్సవాలు గ్రామాలలో ఇపుడు జరగడంలేదు. వాటిని పునరుద్ధరించడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వివిధ పర్వదినాలలో గ్రామంలో ఆలయాల తాలూకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. అపుడు ప్రజలు హారతులు, బియ్యం వివిధ ఫలాలు దక్షిణలు సమర్పిస్తారు. పూజారులు వారికి ప్రసాదం ఇస్తారు. ఇట్టి ఊరేగింపులు ప్రధాన వీధులకే పరిమితం అవుతున్నాయి. ఇవి దళిత వాడలకు కూడా వెళ్లాలి. వారిలో కూడా ఆర్థికంగా వృద్ధి చెందినవారు కొందరున్నారు. వారిచ్చే కానుకలు స్వీకరించి ప్రసాదం అందజేయాలి. తిరుపతి దేవస్థానం శ్రీశైలం దేవస్థానం మొదలైన పెద్ద ఆలయ ధర్మకర్తలు ఈ విషయం ఆలోచించాలి. పీఠాధిపతులు ఈ విషయంలో సలహాలు ఇవ్వాలి. విశ్వహిందూ పరిషత్ వారుకూడా ఇందుకు తగిన కృషి చేయాలి. గ్రామ పెద్దల సహకారం ముఖ్యంగా ఇందుకు అవసరం. అలా జరిగినపుడు దళితుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మత మార్పిడులు చాలావరకు ఇందువలన తగ్గుతాయి. దళితుల అణిచివేతకు కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు ఎంతో వ్యధ చెందారు. వారి వ్యాసాలలో అక్కడక్కడ అస్పృస్యతను ప్రస్తావించడంతోపాటు అస్పృశ్యత అనే పేరుతో ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. అందులో మార్నేరు నంబి, పెరియ నంబి అను వారిద్దరి వృత్తాంతం చదువుతే ఆశ్చర్యం కలుగుతుంది. పెరయనంబి బ్రాహ్మణుడు. మార్నేరు నంబి పంచముడు. వీరిద్దరూ యమునాచార్యులవారివద్ద విద్యాభ్యాసం చేశారు. ప్రాణస్నేహితులు. పెరియనంబి గృహస్థాశ్రమం స్వీకరించాడు. మార్నేరు నంబి బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అవసానదశలో అతడు పెరియనంబికి వర్తమానం చేసి తన అంత్యక్రియలు నిర్వహించవలసినదిగా కోరాడు. పెరియ నంబి ఆ విధంగా చేసి మిత్రుని మరణానికి మైలపట్టాడు. ఇది రామానుజాచార్యులు కాలంలో జరిగిన యధార్థ గాధ. ఈ సందర్భంగా ఆ వ్యాసంలో పానుగంటి వారి మాటలు చూడండి!
భారతీయ పూర్వాచారములన్నియు నశించినవి. వాని వలెనే రుూ యస్పృశ్యత కూడా నశింపదగినది. అది మనకు బాధనిచ్చుట లేదు. కావున దీనినింక యట్టె యుంచినాము. ఇది మరింత పాపము. మీకు మతము పోవునప్పటికి బ్రతుకు పోవునప్పటికి రామానుజులు గోపురమెక్కి తిరుమంత్రముపదేశించినట్లు మీరు వారి నుద్ధరించుట మహాకార్యము. మీరట్లు చేయలేరా? ఇప్పుడే కాకపోయినా మరి యింక కొలదికాలమునైన వారె మన స్థానమాక్రమింతురు. ఇప్పుడె యట్లు చేసి మాట దక్కించుకొనుట మంచిది.

-వేదుల సత్యనారాయణ