బిజినెస్

స్వ‘శక్తి’కి నిదర్శనం మారిటైమ్ ఎగ్జిబిషన్‌లో అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్ దేశ స్వావలంబనను ప్రతిబింబిస్తోంది. దేశ నౌకాదళ అవసరాలను తీర్చేదిశలో జరుగుతున్న కృషికి అద్దం పడుతోంది.
నౌకాదళానికి చెందిన వివిధ విభాగాలు, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచాయి. దాదాపు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు సందర్శకుల తాకిడి ఉదయం నుంచే ఉంటుండగా, నౌకాదళ ప్రయోగాలు ఆహూతులను అబ్బురపరుస్తున్నాయ.
వ్యర్థంతో..
కొచ్చిన్‌కు చెందిన నేవల్ షిప్ రిపేర్ యార్డు (ఎన్‌ఎస్‌ఆర్‌వై) వ్యర్థంతో వివిధ పరికరాలను రూపొందించింది. నౌకల్లోని వివిధ విడిభాగాలను ఉపయోగించి పరుగెత్తుతున్న గుర్రం విగ్రహాన్ని తయారు చేశారు. ఇది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దీనిపై ఎక్కి ఫొటోలు దిగేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.
ఇ-సైకిల్....
గుజరాత్‌లోని ఐఎన్‌ఎస్ వల్సురా ఇ-సైకిల్‌ను ప్రదర్శనలో ఉంచింది. బ్యాటరీతో నడిచే సైకిల్ ఇది. పూర్తిగా చార్జి చేసిన బ్యాటరీతో దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో 30 కిలోమీటర్ల వరకూ దీనిపై ప్రయాణించవచ్చు. చూడముచ్చటగా ఉన్న దీనికి వైర్‌లెస్ సెట్ వంటివి అమర్చుకునే వీలూ ఉంది.
అండమాన్ దీవులకు విద్యుత్ కోసం..
అండమాన్ దీవుల్లోని విద్యుత్ అవసరాలను కాలుష్య రహితంగా తీర్చేందుకు ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ విధానం వర్కింగ్ మోడల్‌ను అక్కడ ప్రదర్శనలో ఉంచారు. సముద్ర నీటి ఉపరితలం, ఉపరితలం నుంచి 1,000 మీటర్ల లోతులో ఉష్ణోగ్రతల వ్యత్యాసం, అమ్మోనియా ఒక విధానం ద్వారా ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం అక్కడి కొన్ని దీవులకు డీజల్‌ను ఉపయోగించి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. కొత్త విధానంలో విద్యుత్ తయారీ వలన ఖర్చు తక్కువ కావడంతో పాటు కాలుష్యం ఉండదు. ఈ తరహా టెక్నాలజీ ప్రపంచంలోనే తొలిసారిగా ఇక్కడ అభివృద్ది చేస్తున్నారు.
నిఘా నేత్రం...
సముద్ర గర్భంలో వివిధ పరికారాలు, నౌకలు, జలాంతర్గాములు, ఇతర వస్తువుల ఉనికి గుర్తించే లెథల్ ఐ ఫర్ అండర్ వాటర్ టార్గెట్స్ పరికరం కూడా ఆకర్షణగా నిలుస్తున్నది. సముద్ర గర్భంలోకి విద్యుత్ తరంగాలను పంపి వాటి ద్వారా ఆయా వస్తువుల ఉనికి, దిశని, గమనాన్ని తెలియచేస్తుంది. ఈ వ్యవస్థను బిఇఎల్ అభివృద్ధి చేసింది. ఆ సమాచారాన్ని విశే్లషించి తగిన చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది.
వెంటాడే కెమారా కన్ను
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) అభివృద్ధి చేసిన స్టెబిలైజ్డ్ ఎలక్ట్రిక్ ఆఫ్టిక్ సిస్టమ్ వెంటాడే కెమెరా కన్నుగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి చిత్రాన్ని దానిలో నిక్షిప్తం చేస్తే, నిర్ణీత పరిధిలో ఆ వ్యక్తి కదలికలను ఈ కెమెరా పసిగడుతుంది. ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తిని గుర్తు పట్టే వీలు ఉంది. దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో ఇది పని చేస్తుంది. రాత్రి, పగటి సమయాల్లో కూడా ఇది నిర్దేశించిన వ్యక్తిని గుర్తించే వీలు ఉంది. అనుమానిత వ్యక్తుల సంచారాన్ని పరిశీలించేందుకు ఇది ఉపకరిస్తుంది.
భారత ఖ్యాతి.. బ్రహ్మోస్
భారత అమ్ముల పొదిలో బ్రహ్మోస్ క్షిపణి చేరడంతో రక్షణ రంగ వ్యవస్థ మరింతగా పరిపుష్టం అయిందనవచ్చు. రష్యా, భారత్ సయుక్తంగా రూపొందించిన క్షిపణుల నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. నీటి నుంచి, భూమిపై నుంచి, గగన తలం నంచి ప్రయోగించే వీలున్న విధ్వంసక క్షిపణి ఇది. లక్ష్యం కూడా భూమిపై, సముద్రంలో, గగనంలో ఉన్నా ఛేదించగలదు. భూమి నుంచి ప్రయోగించేందుకు వీలుగా మొబైల్ ఆటోనమస్ లాంచర్‌ను కూడా తయారు చేశారు. 3,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. నిట్టనిలువుగా దీన్ని ప్రయోగించే వీలు ఉన్న ఫ్రిగేట్‌ను తయారు చేశారు. దీని వలన 360 డిగ్రీల కోణంలో లక్ష్యం ఎక్కడ ఉన్నా, నౌక దిశను మార్చకుండా లక్ష్యాన్ని చేధించే వీలు ఉంటుంది.
నిర్మాణంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్
యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించడంతో అదే పేరుతో దేశీయ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్‌యార్డు మరో యుద్ధ నౌకను నిర్మిస్తున్నది. 30 యుద్ధ విమానాలు నిలిపి ఉంచే సామర్థ్యం కలిగిన ఈ నౌక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నది. ఇది 2018 నాటికి నౌకాదళంలో ప్రవేశపెడాతారు. ఈ నౌకకు సంబంధించిన నమూనా ప్రదర్శనలో ఆకర్షణగా ఉన్నది.
సుఖోయ్ యుద్ధ విమానం ఇంజన్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తమ సుఖోయ్ విమాన ఇంజను కూడా ప్రదర్శలో ఉంచింది. ఎఎల్ 30గా వ్యవహరించే ఇంజన్‌ను ప్రదర్శనలో ఉంచారు. ఇంజన్ ముందు భాగం నాగు పాము పడగ వలే నిలువుగా కదిలే వీలు దీని ప్రత్యేకత. ధ్రువ్ హెలికాప్టర్ కూడా చూడవచ్చు. డిఆర్‌డిఎ రూపొందించిన వివిధ వరుణ తదితర అస్త్రాలను, వివిధ ఉపగ్రహ నమూనాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
భద్రత కోసం..
వృద్ధులు, చిన్నారులు, మహిళలు తప్పిపోయినప్పుడు తమ వారికి తమ ఉనికి తెలిపే భద్రతా పరికరాన్ని ఇసిఐఎల్ రూపొందించింది. ఈ పరికరానికి ఉన్న మీట నొక్కితే అయిదు మందికి ఆ వ్యక్తి ఉన్న స్థలం తదితర వివరాలు ఎస్‌ఎంఎస్ వెళుతుంది. ఆ వ్యక్తి ఎస్‌ఎంఎస్ చేయలేనప్పడు మనం కాల్ చేస్తే కూడా ఆ సమాచారం వస్తుంది. సెల్‌ఫోన్ సిమ్, బ్యాటరీ ఉపయోగించి ఈ పరికరం పని చేస్తుంది. ఈ పరికరం ప్రొటోటైప్ సిద్ధమైంది. ఇంకా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది.
మ్యానోవర్ బోర్డు
సముద్రంలో నౌక అంచు నుంచి నీళ్లల్లోకి పడిపోతే రక్షించేందుకు మ్యాన్ ఓవర్ బోర్డు పరికరం సాయ పడుతుంది. నౌక గ్యాంగ్‌వేలను ఆనుకుని ఈ పరికరాలను ఏర్పాటు చేస్తా రు. మనిషి పడినట్లు గుర్తించగానే ఈ పరికరాన్ని కూడా నీళ్ళలోకి పడేస్తారు. ఈ పరికరం నీళ్లలో పడిన తరువాత 15 నిమిషాల వరకూ లైటు వెలుగుతూ నారింజ రంగు పొగ వదులుతుంది. మనిషి పడిన స్థలాన్ని ఈ పరికరం గుర్తించేందుకు సహకరిస్తుంది. ఇవిగాక మన రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధిని తెలిపే అంశాలతో సందర్శకులను ప్రదర్శన ఆకట్టుకుంటున్నది.