క్రీడాభూమి

టీ-20 లేనిదే క్రికెట్ లేదు:గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, ఫిబ్రవరి 23: టీ-20 మ్యాచ్‌లతో ప్రయోజనం లేదని, దీనివల్ల డబ్బు, సమయం వృథాయేనని, వీటిని రద్దు చేయడం మేలని కొందరు మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం లేపుతున్న తరుణంలో అందుకు భిన్నంగా కొందరు మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడిపుడే క్రికెట్ రంగంలో రాణిస్తున్న యువతకు మనోధైర్యం ఇస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు యువతలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాయి. టీ-20 ఫార్మాట్లలో మ్యాచ్‌లు లేనిదే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు మనుగడ సాగించలేవని గంగూలీ పేర్కొన్నాడు. ‘క్రికెట్‌లో టీ-20 మ్యాచ్‌లు తప్పనిసరి. టీ-20 లేనిదే క్రికెట్ మనుగడ సాగించలేదు’ అని ఆయన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. టీ-20లను రద్దు చేయడమంటే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని చంపివేయడమేనని గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటివరకు ఆడిన టెస్టు మ్యాచ్, వనే్డ మ్యాచ్‌లలో ఆడిన తీరు, శనివారం జరిగే టీ-20 మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సేన ఇప్పటివరకు అద్భుత ప్రదర్శనను కనబరుస్తోందని అన్నాడు. టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయినా జట్టు సభ్యులందరి ఆటతీరు ప్రశంసనీయమని అన్నాడు. అదేవిధంగా ఆరు వనే్డలలో 5-1 తేడాతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించి అఖండ విజయం సాధించడం పట్ల ఆయన అభినందనలు తెలిపాడు. ఇపుడు శనివారం జరిగే టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయపతాకాన్ని ఎగురవేసి విదేశీ గడ్డపై రెండు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లలో ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో విజయం సాధించిన కోహ్లీ సేన, టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కూడా గెలుపొందడం ద్వారా ఈ రెండింటిలో అఖండ విజయం సాధించిన ఘనతను సంపాదిస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు. అదేవిధంగా భారత జట్టులోని యువ ఆటగాళ్లు తమకు అంతర్జాతీయ వేదికలపై వచ్చే సదకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆ దిశగా కృషి చేయాలని సూచించాడు. జట్టులో మనీష్ పాండే, హార్థిక్ పాండ్య వంటి ఎంతోమంది యువ ఆటగాళ్లకు చోటు దక్కించుకోవడం గొప్ప విషయమని అన్నాడు. యువ క్రికెటర్లు భవిష్యత్తులో ప్రముఖ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్ వంటి వారిలా ఎదగాలని ఆయన అభిలషించాడు. సెహ్వాగ్, హర్బజన్ సింగ్ ఒకే సమయంలో క్రికెట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులుగా ఎదిగిన విషయాన్ని నేటి యువ క్రికెటర్లు గుర్తుంచుకోవాలని అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 28 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ వనే్డలు, టీ-20 మ్యాచ్‌లలో ధోని గొప్పగా రాణిస్తాడని, గట్టి పట్టుదల, దూకుడుగా ఆడడం ధోనీని వెన్నతో పెట్టిన విద్య అని అన్నాడు. ఇలాంటి సీనియర్ క్రికెటర్లను జట్టులోని యువ క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని ఆయన సూచించాడు. ఇక భారత క్రికెటర్ల ఫిట్నెస్‌పై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టుతో పోల్చుకుంటే కోహ్లీ సేనలో అంత భారీ నష్టం లేదని వ్యాఖ్యానించాడు. ఇక భారత మహిళా జట్టుకు గురించి ఆయన ప్రస్తావిస్తూ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కంటే బాగా రాణిస్తూ సిక్సర్లు బాదిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించాడు. మొత్తానికి విదేశీ గడ్డపై వివిధ మ్యాచ్‌లు ఆడుతున్న భారత పురుషులు, మహిళల జట్లు రాణిస్తున్న తీరు బాగానే ఉందని పేర్కొన్నాడు.
‘క్రికెట్ సంఘాల రాజ్యాంగాల్లో సవరణలతో
లోధా కమిటీ సిఫార్సుల అమలులో జాప్యం’
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రికెట్ సంఘాల రాజ్యాంగాల్లో పలు సవరణలు చేయడం వల్ల లోధా కమిటీ సిఫార్సులు అమలు కాలేదని, ఇదే జరిగితే ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కోవలసి వస్తుందని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్ వోరాహ్ పేర్కొన్నారు. ఈమేరకు వారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సంయుక్తంగా ఒక లేఖ రాశారు. బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఇటీవల రాష్ట్రంలోని అన్ని క్రికెట్ అసోసియేన్‌లకు పంపిన మెయిల్ సందేశంలో లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం గురించి తమ కమిటీలో సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నాడు. తమ కమిటీ మరోసారి ప్రత్యేక సమావేశం నిర్ణయించి తదుపరి కార్యాచరణపై మిగిలిన అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపేందుకు కొంత సమయం కావాలని ఆయన తెలిపాడు.