క్రీడాభూమి

‘డబుల్స్’పై భారత మహిళా జట్టు కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 23: పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సిరీస్‌పై భారత మహిళా క్రికెట్ టీమ్ కనే్నసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇప్పటికే 2-1 తేడా ఆధిక్యంలో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన శనివారం జరిగే ఆఖరిది, ఐదోది అయిన మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలిచి ప్రత్యర్థి జట్టుపై రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలోనూ గెలుపొందిన ఘనతను సంపాదించుకోనుంది. భారత జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 2-1 తేడాతో ఘనవిజయం సాధించి కప్‌ను ఎగురవేసుకుపోయింది.
తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ జట్టు ఏడు వికెట్లు, తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అయితే, మూడో మ్యాచ్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడడంతో నాలుగో మ్యాచ్ గెలిస్తే తప్ప సిరీస్ వశం అయ్యే అవకాశాలు లేవు. ఇదే ప్రత్యర్థితో ఇప్పటివరకు జరిగిన నాలుగు టీ-20 మ్యాచ్‌లలో 2-1 భారత్ ఆధిక్యంతో ఉంది. వాస్తవానికి బుధవారం సెంచూరియన్ మైదానంలో జరిగిన నాలుగో మ్యాచ్ భారత్‌కు నిర్ణయాత్మకమైనది కాగా, వరుణుడి రూపంలో ఆటకు ఆటంకం కలుగడంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నాలుగో మ్యాచ్ సందర్భంగా వర్షం ఆటంకం కల్పించడంతో ఆటను కొనసాగించే అవకాశం లేకపోవడంతో అప్పటికే బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 15.3 ఓవర్లలో 130 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయినా మ్యాచ్‌ను ఎంపైర్లు అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో భారత్‌కు ఐదో మ్యాచ్ ద్వారా మరో మంచి అవకాశం వచ్చినట్టే. శనివారం జరిగే ఐదో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే విదేశీ గడ్డపై వరుసగా టీ-20, వనే్డ సిరీస్‌లను గెలుచుకున్న ఘనతను సముపార్జించుకుంటుంది. విదేశీ గడ్డపై రెండు సిరీస్‌లను గెలుచుకున్న రికార్డు ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు మాత్రమే ఉంది. ఇపుడు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఇటు వనే్డలు, అటు టీ-20 మ్యాచ్‌లు రెండింటిలోనూ గెలిస్తే ఆ ఘనతను దక్కించుకున్న తొలి భారత జట్టుగా రికార్డు పుటల్లోకి ఎక్కుతుంది.
ఇక భారత జట్టులోని సీనియర్ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇప్పటివరకు బాగానే రాణిస్తోంది. గడిచిన తొలి రెండు టీ-20 మ్యాచ్‌లలో ఆమె 54, 76 పరుగులు చేసినా మూడో మ్యాచ్‌లో మాత్రం పరుగులేమీ చేయకుండానే నిరాశపరిచింది. మిథాలీ రాజ్ తన ఓపెనింగ్ పార్టనర్ మంధానతో కలసి 28, 57, 37 భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ జట్టుకు మంచి స్కోరును అందించగలిగారు. మూడో మ్యాచ్‌లో జట్టులోని మిడిలార్డర్ అంతా విఫలమై నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని ఒంటరి పోరాటం చేసి 30 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేసింది.
అదేవిధంగా వేదా కృష్ణమూర్తి తొలి రెండు మ్యాచ్‌లలో తనదైన రీతిలో 37, 23 పరుగులు చేసినా మూడో మ్యాచ్‌లో నిరాశపరిచింది. శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో మిథాలీ రాజ్, మంథాన, హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును విజయతీరాలకు నడిపే బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక బౌలింగ్ విషయాకికొస్తే ఆఫ్‌స్పిన్నర్ అనూజ పాటిల్ గడిచిన మూడు మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించి తానేమిటో రుజువుచేసుకుంది.
గడిచిన మూడో మ్యాచ్‌లో ఆమె నాలుగు ఓవర్లలో 44 పరుగులిచ్చింది. మరో స్పిన్నర్ పూనమ్ యాదవ్, యువ పేసర్ పూజా వస్ట్రాకర్ కూడా తమదైన స్టయిలో ఆడుతూ గడచిన మ్యాచ్‌లలో నాలుగేసి వికెట్లు పడగొట్టారు. ప్రముఖ పేసర్ గాయం కారణంగా ఆడే పరిస్థితి లేకపోవడంతో ఈమె స్థానంలో పూజా వస్త్రాకర్‌ను జట్టులోకి తీసుకోవడంతో తన ప్రతిభతో యాజమాన్యం ప్రశంసలను అందుకుంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే..గడిచిన రెండు మ్యాచ్‌లలో ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వలేకపోయిన కెప్టెన్ డి వాన్ నైకెర్క్ సేన మూడో మ్యాచ్‌ను ఐదు వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది. నాలుగో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఐదో మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని యోచిస్తోంది. జట్టులో షబ్నిమ్ ఇస్మాయిల్ తన అద్భుత ఆటతీరుతో మొదటి మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టింది.
అదేవిధంగా ఎం.డేనియల్స్ క్లాస్ మూడు, రెండు వికెట్లు తీసుకున్నారు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిజెల్లా లీతో కలసి కెప్టెన్ డి వాన్ నైకెర్క్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. వీరిద్దరితోపాటు జట్టు సభ్యులంతా సమష్టిగా ఆడి శనివారం జరిగే తుదిపోరులో గెలిచేందుకు అస్తశ్రస్త్రాలను సంధిస్తున్నారు.