క్రీడాభూమి

69 కిలోల కేటగిరీలో జాతీయ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 23: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ మూడవ రోజు పోటీల్లో పురుషుల 69 కిలోల కేటగిరీలో కొత్త రికార్డు నెలకొంది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అచింటషెల్లి క్లీన్ అండ్ జర్క్‌లో 158 కిలోల బరువునెత్తి జాతీయ రికార్డు సృష్టించాడు. అంతకముందు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన లాలుటాగ పేరుమీద ఉన్న 157 కిలోల రికార్డును అచింటషెల్లి బద్దలు కొట్టారు. ఈ కేటగిరీలో ఆచింటషెల్లి స్నాచ్‌లో 125 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 158 కిలోలతో మొత్తం 283 కిలోలు బరువునెత్తి స్వర్ణపతకం గెలుచుకున్నారు. అలాగే జూనియర్ కేటగిరీలో కూడా అదే బరువునెత్తి మొత్తం 6 స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.