క్రీడాభూమి

సఫారీలకు చావో..రేవో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్‌టౌన్, ఫిబ్రవరి 23: టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా శనివారం కేప్‌టౌన్‌లో జరుగనున్న మూడో మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌ను కైవసం చేసుకుని కరేబియన్ టూర్‌కు ముగింపు పలికేందుకు భారత్ యోచిస్తోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్-దక్షిణాఫ్రికా చెరొటి గెలుచుకున్నాయి. ఇక మూడవది, ఆఖరిది అయిన శనివారం జరుగబోయే మ్యాచ్‌పై ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాకు చావో..రేవో..తేల్చేస్తుంది. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌కు రెండో మ్యాచ్‌లో వాతావరణం సరిగా అనుకూలించక ప్రతికూల పవనాలు వీచిన నేపథ్యంలో ప్రత్యర్థిదే పైచేయి అయింది. దీంతో సిరీస్ తమ వశం కావాలంటే ఇరు జట్లు శనివారం జరుగబోయే ఇరు జట్లు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ పర్యటిస్తున్న గడిచిన ఎనిమిది వారాల టూర్‌లో భాగంగా జరిగిన వివిధ టోర్నీలు, మ్యాచ్‌లలో బుధవారం నాటి టీ-20 మ్యాచ్‌ను కోల్పోవడంతో జట్టును ఒకవిధంగా నిరాశకు గురిచేసింది. జోహానె్సస్‌బర్గ్‌లో జరిగిన మొదటి టీ-20లో 28 పరుగుల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించిన కోహ్లీ సేన బుధవారం సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టీ-20లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్ ఇప్పటివరకు విదేశీగడ్డపై ఎప్పుడూ టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. దక్షిణాఫ్రికాలో ఆరు వారాల పర్యటనలో భాగంగా భారత్ టెస్టు మ్యాచ్, ఆరు వనే్డ మ్యాచ్‌లు ఆడింది. మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఆడగా, ఆఖరిది, మూడవది శనివారం కేప్‌టౌన్‌లో జరుగనుంది. విదేశీగడ్డపై అదీ దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్‌లు ఆడడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటివరకు ఎనిమిది టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఐదింటిలో ఓడిపోయింది. 2007, 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా విజయాలను తన ఖాతాలో నమోదు చేసింది. అప్పటినుంచి తమ స్వంత గడ్డపై జరుగుతున్న తక్కువ ఓవర్ల మ్యాచ్‌లలో (టీ-20) చక్కని ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తోంది. భారత్‌తో టీ-20 మ్యాచ్‌ల కంటే ముందు జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతోపాటు వాండరర్స్ స్టేడియంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో సైతం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బాగా రాణించారు.
బుధవారం టీ-20లో భారత్‌పై గెలుపుతో మంచి ఊపుమీదున్న కెప్టెన్ జేజే డుమినీ సేన తొలినుంచి ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా పావులు కదిపాడు. అయితే, మొదటి టీ-20లో ఓటమిపాలైనా రెండో మ్యాచ్ తమకు ప్రతిష్టాత్మకం కావడంతో భారత్ బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసి మూడు టీ-20లలో 1-1తో సమంగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌ల నుంచే డుమినీ తమ జట్టు సభ్యులందరినీ అన్నివిధాల సన్నద్ధం చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని అందుకు తగ్గట్టుగానే వ్యవహరించాడు. టీ-20 రెండో మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్ల బంతులను తుత్తినియలు చేసి, జట్టును విజయ పథంలో నిలిపాడు. మూడో మ్యాచ్‌లో కెప్టెన్ డుమినీ, హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చిరస్మరణీయమైన పరుగులు సాధించడంతో అదేతీరుతో వారిద్దరూ చివరి మ్యాచ్‌లో నిలదొక్కుకుంటే భారత్‌కు కష్టకాలం ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సైతం ఇదే తరహా ఆటతీరును కనబరచడం ద్వారా ఇరు జట్లకు ప్రతిష్టాత్మకమైన సిరీస్‌ను వశం చేసుకోవాలని దక్షిణాఫ్రికా కెప్టెన్ జట్టును తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. అయితే, మూడో మ్యాచ్‌లో ఆడే తమ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండానే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ జట్టులో జోన్ జోన్ స్మట్, డేవిడ్ మిల్లర్ తమ బ్యాటింగ్‌ను జులిపిస్తారనుకుంటే ఆశించిన ఫలితం కానరాలేదు. ఈ విషయం ఇప్పటికే జరిగిన వివిధ మ్యాచ్‌లలో రుజువైన నేపథ్యంలో ఉన్నవారితోనే గెలుపు సాధించే దిశగా డుమినీ సేన ముందుకు దూసుకువెళ్తోంది.
ఇక భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతను మూడో టీ-20 మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఏకోశానా కనిపించకపోవడంతో అతని స్థానంలో మరొకరిని జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. శ్రీలంకతో వచ్చే రెండు వారాల్లో జరిగే ట్రై సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా సేవలను వినియోగించుకోవాలని యాజమాన్యం యోచిస్తోంది.
ఇక బౌలింగ్ కాంబినేషన్ విషయానికొస్తే ఎడమచేతివాటం స్పిన్నర్లను నమ్ముకుని దిగిన కోహ్లీకి వాతావరణం అనుకూలించకపోవడంతో సరైన ఫలితాలు రాకపోయినా నిరాశ చెందకుండా ఎడమచేతి వాటం స్పిన్నర్ జయదేవ్ ఉనద్కత్‌కు బాధ్యతలు అప్పజెప్పినా నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. గడిచిన మ్యాచ్‌లో జయదేవ్ ఉనద్కత్ 75 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 64 భారీగా పరుగులిచ్చినా, శనివారం జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ తీరును మార్చి ప్రత్యర్థిపై దాడి చేయాలని కోహ్లీ యోచిస్తున్నాడు. అదేవిధంగా సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన శర్దూల్ ఠాకూర్‌ను కూడా ఈ మ్యాచ్‌లో సమర్థవంతంగా ఉపయోగించుకోనున్నారు. అదేవిధంగా స్పిన్నర్ల ద్వయంలో ఒకడైన కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ వంటి వారిపై కూడా కోహ్లీ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఏదేమైనా వనే్డ సిరీస్‌ను 5-1 తేడాతో గెలుచుకున్న కోహ్లీ సేన, టీ-20 ఆఖరి మ్యాచ్‌లో విజయంతో టూర్‌కు ఘనమైన ముగింపు పలకాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.