బిజినెస్

మార్చిలో ఆక్వాపై అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 23: ఆక్వా రంగంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈరంగం నుండి విదేశీ మారకద్రవ్యం అధికంగా లభిస్తుండటంతో అన్ని రాష్ట్రాల దృష్టి ఆక్వా అభివృద్ధిపై పడింది. ఈ రంగంలో ఉన్న నైపుణ్యత, టెక్నాలజీ తదితర అంశాలపై చర్చించి, దేశంలో అమలుచేసేందుకు తొలి సారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, తిరుపతి వెటర్నరీ విశ్వవిద్యాలయం తదితర సంస్ధలు సంయుక్తంగ హైదరాబాద్‌లోని ఆక్వా ఎక్స్ ఇండియా-2018పేరుతో అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాయి. దక్షిణ ఆసియా దేశాల్లో తొలిసారిగా ఇటువంటి సదస్సును తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్నారు. మార్చి 15 నుంచి 17వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. అమెరికా, స్కాట్‌లాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, తైవాన్, శ్రీలంక వంటి 11 దేశాల నుంచి శాస్తవ్రేత్తలు హాజరవుతారు. ఈ మూడు రోజుల్లో 14మంది శాస్తవ్రేత్తలు ఆక్వా రంగం పరిస్థితి, మెరుగైన ఫలితాలు సాధించడం, ఉత్పత్తి, వైరస్ బెడద తదితర అంశాలపై చర్చిస్తారు.
భారత్ నుంచి నలుగురు ఇతర దేశాల నుంచి 10 మంది ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్, అసోం, తెలంగాణ, ఒడిశా, బీహార్, తమిళనాడు, గోవా తదితర రాష్ట్రాల నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు హాజరుకానున్నారు. వీరితో పాటు సీడు ఉత్పత్తి చేసే హేచరీలు, రైతులు, టెక్నిషియన్లు, ప్రోసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు, ఎగుమతిదారులు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఆక్వాఎక్స్ ఇండియా-2018లో ఆక్వా రంగంలో కొత్త రకాలను పరిచయం చేయడంతోపాటు, వరల్డ్ సీఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని డెల్టా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. భారత్ నుంచి ఏటా 5.5 బిలియన్ డాలర్లు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని, 142 కోట్ల మంది జనాభా ఉన్న చైనాలో 65 శాతం ఆక్వా ఉత్పత్తి జరుగుతుండగా, మన దేశంలో 132 కోట్ల మంది ఉండగా కేవలం 6.5 శాతమే ఆక్వా ఉత్పత్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటువంటి తరుణంలో ఆక్వా ఉత్పత్తులను పెంచడానికి కావలసిన సలహాలు, సూచనలు ఈ సదస్సు ద్వారా అందిస్తారన్నారు. విలేఖర్ల సమావేశంలో ఆక్వా ప్రిన్సిపల్ సైంటిస్ట్ టి.సుగుణ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణి ప్రకాష్, కోస్టల్ ఆక్వా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కలవపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.