బిజినెస్

నాన్న అధ్యక్ష పదవి వ్యాపారానికి అడ్డంకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: అమెరికా అధ్యక్షుడిగా తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం తమ కుటుంబ వ్యాపారాలకు నిస్సందేహంగా వ్యతిరేక పరిణామమేనని అమెరికా స్థిరాస్తి వ్యాపార దిగ్గజం, ట్రంప్ పెద్దకుమారుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ అన్నారు. అయితే అధ్యక్ష బాధ్యతలు పూర్తయిన తరువాత ఆయన మళ్లీ వ్యాపార రంగంలోకి వస్తారని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత్‌లో ఎటువంటి కొత్త ప్రాజెక్టులపై ట్రంప్ సంస్థలు సంతకాలు చేయలేదు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వరాదన్న లక్ష్యంతో విదేశాల్లో తమ సంస్థ కొత్తగా ఎటువంటి వ్యాపారాలు చేయబోదని ట్రంప్ సంస్థలు గత జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్‌లో ట్రంప్ సంస్థల భాగస్వామి లోధా గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ జూనియర్ మాట్లాడారు. తమ సంస్థకు భారత మార్కెట్ ఎంతో కీలకమని, మళ్లీ మా కుటుంబం వ్యాపారాల్లోకి రాగానే భారత్ మార్కెట్‌పై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. లోధా గ్రూపుతో కలసి ట్రంప్ సంస్థలు ముంబయిలో ట్రంప్ టవర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ పెద్దకుమారుడైన జూనియర్ ట్రంప్ గత పదేళ్లుగా వారి సంస్థల తరపున భారత్‌కు వచ్చివెళుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగిస్తున్నారు. సరైన మార్కెట్‌లో, సరైన భాగస్వాములతో గడచిన పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నామని ట్రంప్ జూనియర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్‌లో విలాసవంతమైన ప్రాజెక్టులకు ఆదరణ తక్కువేనని, అయితే ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని అన్నారు. ఆసియాలో అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా రాణిస్తున్న భారత్‌లో స్థిరాస్థి రంగంలో తమ సంస్థల భాగస్వామ్యాన్ని భవిష్యత్‌లో వృద్ధి చేసుకునేందుకు వచ్చిన ట్రంప్ జూనియర్ వారం రోజుల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో 2013లో ప్రారంభించిన అత్యంత విలాసవంతమైన గృహాల నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభించిన ట్రంప్ సంస్థలు ముంబయిలో 78 అంతస్థుల ‘ట్రంప్ టవర్’ నిర్మాణాన్ని ప్రారంభించాయి. దీనిపై స్పందించిన ట్రంప్ జూనియర్ 2019నాటికి దీనిని పూర్తి చేస్తామని చెప్పారు. లోధా గ్రూప్‌తో కలసి పూనే, గురుగావ్, కోల్‌కతోలలో పంచ్‌శీల్ రియాల్టీ, ఎమ్3ఎమ్, ట్రిబెకా, యూనీమార్కె, ఐఆర్‌ఈఓ ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ తన ఐదో ప్రాజెక్టుగా ఒక వాణిజ్య కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. విదేశాల్లో స్థిరాస్థి వ్యాపార రంగంలో ట్రంప్ సంస్థలు చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో భారత్ మార్కెట్ కీలకం. మనదేశంలో ఆ సంస్థలు ఇప్పటివరకు 9.5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాయి.