అంతర్జాతీయం

‘హెచ్1-బి’ మరింత కఠినతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 23:అమెరికాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. హెచ్1-బీ వీసాల జారీ, వాటి కాలపరిమితి పొడిగింపు ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ కొత్త విధానం తక్షణం అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది అమెరికా వెళ్లేందుకు హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులు చేసుకునే సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలు ఆందోళన చెందక తప్పదు. అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు లభించలేదన్న కారణంతో విదేశాల నుంచి తీసుకొచ్చే అనుభవజ్ఞులైన వృత్తి నిపుణులను పనిచేసేందుకు అనుమతిస్తూ అమెరికా వచ్చేందుకు హెచ్1-బీ వీసా జారీ చేస్తారు. అమెరికా జారీ చేసే ఈ వీసాల్లో ఎక్కువగా పొందుతున్నది భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలే. స్థానికంగా అమెరికన్ ఐటీ నిపుణలు లభిస్తున్నా వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా విదేశాల నుంచి నిపుణులను తీసుకువస్తున్నారని భావించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ విధానంలో కఠిన నిబంధనలు తీసుకురావడంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందువల్ల గతంలో ఒక పనికోసం, ఒక కేంద్రంలో పనిచేసేందుకు అని చెప్పి తీసుకువచ్చిన నిపుణులను మరో పనికి ఉపయోగించుకోవడం ఇక కుదరదు. కొత్త విధానం ప్రకారం హెచ్1-బీ వీసాపై వచ్చే ఉద్యోగి ఎక్కడ పనిచేసేదీ, ఆయన చేయబోయే పని ఏమిటన్నది, అతడి నైపుణ్యాన్ని నిరూపించే పత్రాలు సాధికారికంగా నిరూపించవలసి వస్తుంది. గతంలో హెచ్1-బీ వీసాపై తీసుకువచ్చే ఉద్యోగులను ఒకటి లేదా థర్డ్ పార్టీ వర్క్‌సైట్స్‌లో వివిధ పనులు చేయించేవారు. ఇప్పుడు అలా సాధ్యం కాదు. భారత్ నుంచి వచ్చిన ఐటీ నిపుణులు సేవలను ఆన్‌సైట్‌లో ఎక్కువగా అమెరికాలోని బ్యాంకింగ్, ట్రావెల్, కమర్షియల్ రంగానికి చెందిన సంస్థలు ఉపయోగించుకునేవి.
ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం హెచ్1-బీ వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ 7 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకారం ఇకముందు పరిమిత కాలానికి మాత్రమే వర్తించేలా, థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో పనిచేసే ఉద్యోగికి మాత్రమే హెచ్1-బీ వీసా జారీ చేస్తారు. అమెరికా కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా ట్రంప్ తలపెట్టిన ‘బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్’ ఎక్జిక్యూటివ్ ఆర్డర్‌కు అనుగుణంగా తాజా విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. గతంలో మూడేళ్ల కాలపరిమితికి వర్తించేలా ఇచ్చే హెచ్1-బీ వీసాలను జారీ చేసేవారు. కాగా ఇప్పుడు అంతకంటే తక్కువ గడువుకే పరిమితం చేయనున్నారు. కొత్త విధానం ప్రకారం థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌లో పనిచేసే ఉద్యోగి పేరుతో దాఖలయ్యే హెచ్1బీ వీసా దరఖాస్తు ముందు అనుమతి పొందాల్సి ఉంటుంది. పనిచేసేందుకు వచ్చే ఉద్యోగి ఏ పనిలో నిపుణుడో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగి, ఉపాధి కల్పించిన సంస్థల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లూ నిరూపించుకోవాలి. వీటిలో ఏ నిబంధనను ఉల్లంఘించినా ఆ వీసా కాలపరిమితిని తగ్గించే అధికారం యూఎస్‌సీఐఎస్‌కు ఉంటుంది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం హెచ్1-బీ వీసాల కాలపరిమితిని పొడిగించే నిబంధనలూ కఠినతరం చేశారు. ఒక్కోసారి పనిలేదన్న కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ఖాళీగా ఉంచుతూ వీసా మురిగిపోకుండా ‘బెంచ్’పై ఉంచే విధానం అమలులో ఉండేది. ఇప్పుడు అలా కుదరదు. జీతాలు చెల్లించకుండా ఖాళీగా ఉంచి, వీసాను సజీవంగా ఉంచడం అంటే అమెరికా విధానాలను ఉల్లంఘించడమేనని, అది చట్ట విరుద్ధమని యూఎస్‌సీఐఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగి కోసం హెచ్1-బీ వీసా దరఖాస్తు చేసే సంస్థలు ఇకముందు చాలా ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఉద్యోగి చేత చేయించదలచుకున్న అసలు పనేమిటో నిరూపించే సాంకేతిక అర్హతలు, అతడు సాధించిన విజయాలు, మార్కెటింగ్ అనాలిసిస్, బ్రోచర్స్, ఆ ఉద్యోగి చేసే పనులు, అతడి ప్రత్యేకతలు, నైపుణ్యాన్ని నిరూపించే సర్ట్ఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. అలాగే అతడు ఎంత కాలం పనిచేస్తాడో, ఎంత జీతం చెల్లించనున్నారో, ఎన్ని గంటలు పనిచేయించుకుంటారో, అతడికి కల్పించే సౌకర్యాలు, లాభాలు ఏమిటో సవివరంగా ఆ వీసా దరఖాస్తులో పేర్కొనవలసి ఉంటుంది. గతంలో ఇన్ని వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉండేది కాదు.