Others

మెరుపుతీగ! (రకుల్‌ప్రీత్ సింగ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో తాజాగా ఇప్పుడు సినిమా అవకాశాల కోసం కథానాయకుల కన్నా, కథానాయికలే ఎక్కువగా పోటీ పడుతున్నారన్న విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. చాలా మంది హీరోలు తమ లాంగ్వేజ్ చిత్రాల్లోనే నటిస్తుంటే, హీరోయిన్స్ మాత్రం మూడు, నాలుగు భాషా చిత్రాల్లో మెరుపులు కురిపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఒక భాషలో కాస్త డౌన్ ఫాల్ వచ్చినా ఇంకో భాషలో ఇట్టే కవర్ చేసుకోవచ్చు అన్నది వారి ఆలోచనట. కొందరు హీరోయిన్స్‌కు అన్ని భాషా చిత్రాల్లోనూ అవకాశాలు వచ్చేస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ పరిస్థితి మూడు చిత్రాలు.. ఆరు విడుదలలు అన్నట్టుగా ఉంది. వరుస విజయాలతో కెరీర్‌లో అగ్రస్థానంలో దూసుకెళుతున్న కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో పాటు మహేష్‌బాబు ‘స్పైడర్’ అన్నీ వరుసగా వచ్చిపడ్డాయి. అయితే ఆయా చిత్రాల్లో రకుల్ పాత్రలన్నీ మూస ధోరణిలోనే సాగడం వల్ల పెద్దగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఒక దశలో రకుల్‌ప్రీత్ సింగ్ స్పీడ్ చూసి మిగతా కథానాయికలు తెగ కంగారు పడిపోయారు. తెలుగులో అగ్ర హీరోలతో వరుసగా చిత్రాలు చేస్తున్న బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్. తమిళంలోనూ కార్తీ సరసన ‘్ధరమ్ అధిగారం ఒండ్రు’, సూర్య సరసన ఓ చిత్రం, విజయ్ సరసన మరో చిత్రంలో ఛాన్సులు కొట్టేసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ పావులు కదుపుతోంది. చిత్రసీమలోని వారంతా రకుల్ దూకుడు మామూలుగా లేదంటూ వాపోతున్నారు. ఈ విషయం గురించి రకుల్‌ని కదిలిస్తే మాత్రం తన మనసులోని మాటను మరో విధంగా చెప్పుకొచ్చింది.. ‘నేను ఇప్పుడున్న పరిస్థితిని చూసి మురిసిపోవడం లేదు. నిజాయతీగా చెబుతున్నా. ఎందుకంటే సినిమా హిట్ నాకు సంతోషాన్ని ఇవ్వదు. పరాజయం నన్ను బాధించదు. మురిసిపోవడం నాకు కొంచెం కష్టమే. సినిమా హిట్‌ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. మనం చేసిన పనికి గుర్తింపు లభించడం చాలా గొప్ప విషయం. కానీ, నేను తర్వాత ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటాను. గత రెండేళ్లుగా నా ప్రయాణం బాగుంది. ప్రేక్షకులు నా నటన గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎవరికీ గుర్తుండవు. మున్ముందు ఏం చేయాలి? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. విజయాల్ని, అపజయాల్ని ఏ మాత్రం పట్టించుకోను. వెండితెరపై అడుగులు పెట్టినప్పుడు ఒక విధంగా..పెట్టాక మరో విధంగా ఆలోచించడం నాకు చేతకాదు. ఎప్పుడూ నాది ఒకటే దారి.. ఒకటే ఆలోచన. నా దృష్టి అంతా ఎప్పుడూ కెరీర్‌పైనే. అయితే .. అది టాలీవుడ్డా, కోలీవుడ్డా, బాలీవుడ్డా అన్నది నేను పట్టించుకోను’ అని చెప్పుకొచ్చింది రకుల్‌ప్రీత్ సింగ్. రకుల్ తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయంది. తమిళంలోనూ వరుస అవకాశాలు వస్తున్నాయ. గతంలో కార్తీతో నటించిన ఖాకి మంచి విజయానే్న అందుకుంది. బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన అయ్యారి మంచి వసూళ్లు రాబట్టుకుంటోంది. రకుల్ ప్రస్తుతం హీరో సూర్య 36వ చిత్రంలో కథానాయక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కార్తి కొత్త చిత్రంలోనూ కథానాయకగా చేస్తోంది.

-రతన్