హైదరాబాద్

హైదరాబాద్, ఆంధ్రా, కేరళ జట్ల గెలుపు * మహిళల అండర్-23 వనే్డ లీగ్ క్రికెట్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అండర్-23 మహిళల వనే్డ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో పోటీలకు అతిథ్యమిస్తున్న హైదరాబాద్‌తో పాటు కేరళ, ఆంధ్రా జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి. నగరంలో శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 124 పరుగుల తేడాతో గోవాపై, ఆంధ్రా 145 పరుగుల తేడాతో కర్నాటకపై, కేరళ వికెట్ తేడాతో తమిళనాడుపై విజయం సాధించాయి. ఏఓసీ మైదానంలో శనివారం హైదరాబాద్- గోవా జట్ల మధ్య జరిగింది. బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 48.3 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన రచన ఎస్ కుమార్ నాలుగు బౌండరీలతో 65 పరుగులు చేసి ఆర్థ సెంచరీ పూర్తి చేయగా, స్నేహ మోరే 42, ప్రశాంతి రెడ్డి 45 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గోవా జట్టు హైదరాబాద్ బౌలింగ్‌ను తట్టుకోలేక 25.4 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలింగ్‌లో లక్ష్మి ప్రసన్న, రచన ఎస్ కుమార్ చేరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. గెలుపొందిన హైదరాబాద్ జట్టుకు నాలుగు పాయింట్లు లభించాయి. ఈసీఐఎల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కేరళ వికెట్ తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఎల్.నేత్ర 108 పరుగులతో అజేయ సెంచరీ సాధించగా, డి.హేమలత 58 పరుగులతో ఆర్థ సెంచరీ పూర్తి చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన కేరళ మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే 48.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఎస్.సంజన్ 79, జిస్పా వి జోసెఫ్ 34 పరుగులు చేశారు. గెలుపొందిన కేరళ జట్టుకు నాలుగు పాయింట్లు లభించాయి. ఏఓసీ మైదానంలో ఆంధ్రా- కర్నాటక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్నాటక నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రాణించిన కె.అంజలి శ్రావాణి 82, జి.స్నేష 37(నాటౌట్) పరుగులు చేవారు. 230 పరుగుల విజయలక్ష్యాంతో బ్యా టింగ్ బరిలోకి దిగిన కర్నాటక 34.2 ఓవర్లలో కేవలం 84 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ఆంధ్ర బౌలింగ్‌లో రాణించిన ఎల్.నేత్ర 31 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోగా, రెహమాన్, డి.హేమలత 38 పరుగులిచ్చి మూడు వికెట్లు, ఎస్.అనూష, కెఎన్. రమ్యశ్రీ చేరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.