హైదరాబాద్

థియేటర్స్ బంద్‌కు మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: నిర్మాతలకు.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డి సంస్థలకు మధ్య శుక్రవారం బెంగుళూరులో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నాలుగు భాషల చిత్ర నిర్మాతలు ఒకే తాటిపైకొచ్చి మార్చి 2 నుంచి థియేటర్స్ బంద్ చేస్తూ ఆ మూడు డిజిట్ సంస్థలకు సినిమా కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. దీనికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు టిఎఫ్‌సిసి చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- గత పదేళ్లుగా డిజిటల్ వ్యవస్థలపై మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా ముందుకొచ్చి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా డిజిటల్ వ్యవస్థపై పోరాటం చేయడం మంచి పరిణామం. గతంలో మేము డిజిటల్ రేట్లను తగ్గించాలంటూ నిరాహారదీక్ష చేయడం కూడా జరిగింది. కానీ అప్పట్లో పెద్దగా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. కొంతమందికైతే డిజిటల్ రేట్లపై అంత అవగాహన కూడా ఉండేది కాదు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన చర్చల్లో ఆ మూడు డిజిటల్ సర్వీస్ సంస్థలవారు 9 శాతానికి మించి తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు డిజిటల్ ఛార్జెస్ ఐదేళ్ళకు మించి ఉండకూడదు. పదమూడేళ్లయిన కూడా అదే రేట్లు తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు. మన సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలలో తప్ప హాలీవుడ్, బాలీవుడ్‌లలో ఈ విధంగా లేదు. గతంలో 2500లకే డిజిటల్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తామంటూ కొన్ని సంస్థలు ముందుకొచ్చినా కానీ, వారిని రానివ్వకుండా చేశారు కొంతమంది. ఇప్పటికే డిజిటల్ అత్యధిక రేట్లవల్ల రిలీజ్ కాకుండా ఎన్నో చిత్రాలు ఆగిపోయాయి. క్యూబ్, యుఎఫ్‌ఓ, పిఎక్స్‌డి సంస్థలతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే తక్కువ రేట్లకే డిజిటల్ సర్వీసెస్ ప్రొపైడ్ చేస్తామంటూ అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. కాబట్టి మార్చి 2 నుండి థియేటర్స్ బంద్‌కు అందరూ సహకరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. టిఎఫ్‌సిసి సెక్రటరీ సాయి వెంకట్ మాట్లాడుతూ- చాన్నాళ్లుగా డిజిటల్ వ్యవస్థపై మేము ఉద్యమం చేస్తూ వచ్చాం. ఇపుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏకమై ఆ మూడు డిజిటల్ సంస్థలు దిగివచ్చేలా మార్చి 2 నుంచి చేయబోతున్న థియేటర్స్ బంద్‌కు మా మద్దతు ప్రకటిస్తున్నాం. అంతా దీనికి సహకరించాలని కోరుకుంటున్నా. దీన్ని ముందుండి నడిపిస్తున్న జెమిని కిరణ్‌కి, డి.సురేష్‌బాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.