హైదరాబాద్

ఆర్‌కే ప్రొడక్ట్స్ కంపెనీ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 24: నిషేధిత గుట్కాలు తయారు చేస్తున్నారన్న అభియోగంపై మల్లాపూర్ పారిశ్రామికవాడలోని ఆర్‌కే ప్రొడక్ట్స్ (మాణిక్‌చంద్) పరిశ్రమను శనివారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రాణాలను హరించే గుట్కాలను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాణిక్‌చంద్ పరిశ్రమ మూతపడింది. ఇదే స్థానంలో ఆర్‌కే ప్రొడక్ట్స్ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తులలో నిషేధ గుట్కా పదార్థాలను కలుపుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఆర్‌డీవో హన్మంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఉప్పల్ ఆర్‌ఐ రోజా, వీఆర్‌ఓ విశ్వనాథం, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య సీజ్ చేశారు.