కృష్ణ

జాగా లేదన్న పేదలుండకూడదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 24: ఇళ్ళ స్థలాల పంపిణీలో రాష్ట్రానికే మైలవరం ఆదర్శమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం తారకరామానగర్, సూరిబాబుపేట, అయ్యప్పనగర్‌లలో 110 మంది నిరుపేదలకు శనివారం ఇళ్ళ స్థలాల పట్టాలను, వీటితోపాటు చీర, జాకెట్, పసుపుకుంకుమ, తాంబూలం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన ప్రకారం సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. ఇళ్ళ స్థలాల సమస్య ఇప్పటి వరకూ పెండింగులో ఉందని, ప్రభుత్వం చొరవ కారణంగా 388 జీఓను కొలమానంగా తీసుకుని అర్హత కలిగిన అందరికీ ఇళ్ళ స్థలాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ మైలవరం నియోజకవర్గంలో ఐదువేల పైబడి పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో ఇబ్రహీంపట్నం మండలంలో త్వరలో రెండు వేల మందికి పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో అర్హత కలిగిన నిరుపేదలందరికీ పట్టాలిచ్చి రాష్ట్రానికే మైలవరాన్ని ఆదర్శం చేస్తామని చెప్పారు. మైలవరంలో జరుగుతున్న ఇళ్ళ స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి సైతం మెచ్చుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి సీఎం లక్షా 17వేల పట్టాలను పంపిణీ చేయించారన్నారు. ఇదే స్పూర్తితో పని చేసి మైలవరం నియోజకవర్గంలో జాగాలేదన్న పేదలుండకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేసిన వారికి పక్కా ఇళ్ళను కూడా మంజూరు చేస్తామన్నారు. సభలో పాల్గొన్న తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పధకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. జడ్పీ మాజీ చైర్మన్ నల్లగట్ల సుధారాణి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి తెలుగుదేశం హయాంలోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణి, ఉపసర్పంచ్ షహానాబేగం, చండ్రగూడెం సర్పంచ్ పద్మ తదితరులు ప్రసంగించారు.