కృష్ణ

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 24: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వృద్ధులు, వయోవృద్ధులు అవగాహన కల్గివుండాలని, అయితే ఆయా పథకాలు అందేందుకు ఏ విధమైన అవగాహన కల్గివుండాలన్న అంశాలపై జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ సదస్సును ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జస్టిస్ వై లక్ష్మణరావు చెప్పారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వృద్ధులు, వయోవృద్ధులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం 2007లో భారత ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ఈ చట్టం ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, బాధ్యత పిల్లలదేనని చెప్పారు. దేశంలో 11శాతం వయోవృద్ధులున్నారని, వారి ఆరోగ్య బాధ్యతలను పిల్లలు సక్రమంగా చూడాల్సి ఉంటుందన్నారు. ఎంతో మంది వృద్ధులు ఎవరి ఆదరణ లేకుండా జీవనం సాగిస్తున్నారని, వారి సంరక్షణకు చట్టపరంగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందించేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అన్నివర్గాల ప్రజలకూ అందించాలని, సంక్షేమం అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, కుటుంబ వికాసం తదితరాలు సమాజ వికాసానికి దోహదపడతాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో 200దేశాలు ఉండగా 17దేశాలు మాత్రమే సుస్థిర పాలన చేస్తున్నాయన్నారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి వ్యక్తీ తాను సంపాదించిన దానిలో 25శాతం తల్లిదండ్రులకు, 25శాతం సమాజానికి వినియోగించి ఆదర్శంగా జీవించాలన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీవీ రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకునేందుకు న్యాయ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. విభిన్న ప్రతిభావంతులశాఖ కమిషనర్ చక్రవర్తి మాట్లాడుతూ వికలాంగులు వారికి కావాల్సిన రుణ సౌకర్యం, ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం వృద్ధుల సమస్యలపై జస్టిస్ లక్ష్మణరావు సమాధానమిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్ రాజీవ్, డీఆర్వో అంబేద్కర్, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఆర్డీవో ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

కట్టిన ఇళ్లకు కాసులు లేవు... కొత్త ఇళ్లకు శంకుస్థాపనలా?

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 24: మండలంలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంత వరకు డబ్బులు చెల్లించకుండా కొత్త గృహాలకు ఎలా శంకుస్థాపనలు చేస్తారని ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధికారులను ప్రశ్నించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎన్‌టిఆర్ గృహాల శంకుస్థాపన మహోత్సవం విజయవంత చేసేందుకు మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుపేద ఎస్సీ వితంతువుకి పింఛన్ ఇవ్వాలని కొరితే ఆమె పేరు తొలగించి ఐదెకరాలున్న ఓసీ మహిళ పేరు ఎందుకు చేర్చారని, చాగంటిపాడు గ్రామ పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఎందుకు ఆన్‌లైన్ చేయలేదని అధికారులపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శికి తెలియకుండా జన్మభూమి కమిటీ సభ్యులు జాబితా తయారు చేయటంపై ఎంపీపీ మండిపడ్డారు. ఫౌండేషన్ నిర్మించుకున్న లబ్ధిదారులకు ఎన్‌టిఆర్ గృహాలు మంజూరు చేయమంటే నిర్లక్ష్యం వహించారన్నారు. మండలంలో 14 స్మశాన వాటికలు మంజూరతే ఒక్కచోట కూడా నిర్మాణం చేపట్టలేదని, నాలుగు నెలల నుంచి ఎన్‌టిఆర్ గృహాలకు, ఇతర వర్కులకు బిల్లులు రావటం లేదని ఇలాంటి పరిస్థితులుంటే శంకుస్థాపన మహోత్సవాలు ఎలా విజయవంతం అవుతాయని ఎంపీపీ అన్నారు. సమావేశంలో తహశీల్దార్ జి భద్రు, ఎంపీడీఓ, హౌసింగ్ ఈఈ వెంకట సుబ్బయ్య, ఏఈ శివప్రసాద్, విఆర్‌ఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.