కృష్ణ

‘జన్మ’భూమికి సహకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 24: మాతృభూమిపై మమకారంతో తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో వెచ్చించేవారు ధన్యులు. మండలంలోని వెల్వడం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు అడ్డగిరి వెంకట కృష్ణారావు దంపతులు వ్యాపార రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని మైలవరం ప్రాంత అభివృద్ధికి స్వచ్చందంగా వెచ్చించారు. ఇందులో భాగంగా స్థానిక శ్రీ షిరిడీ సాయి బాబా కల్యాణ మండప నిర్మాణానికి కోటి 50 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. అదేవిధంగా మందిరానికి వెళ్ళే మార్గం సిమెంట్ రహదారి నిర్మాణం, వెల్వడంలో రామాలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ, ఆలయ పండితులకు నెలవారీ వేతనం, నిత్యపూజ కొరకు మిగిలిన ఎన్నారైలతో కలిసి పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డ్రగ్ హౌస్‌కు ఐదు లక్షల రూపాయల నిధులను అందించారు. అనేక మంది పేద, బలహీన వర్గాలకు ఉదారంగా సాయం అందించటంతోపాటు పెళ్ళిళ్ళకు, పర్వదినాలకు, వారి వారి గృహాలలో జరిగే శుభకార్యాలకు విరాళం అందిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మహిళా సంఘాలకు సైతం విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికానుండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి సామాజిక సేవాకార్యక్రమాలలో నిమగ్నమై నిధులను అందించి పలువురు ఎన్నారైలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
అడ్డగిరి సేవలకు అధికారుల ప్రశంసలు
ఎన్నారై అడ్డగిరి వెంకట కృష్ణారావు చేస్తున్న స్వచ్చంద సేవలకు అధికారులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. స్థానిక శ్రీ షిరిడీ సాయి బాబా కల్యాణ మండపంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో అడ్డగిరి వెంకట కృష్ణారావును తహశీల్దార్ కెవి శివయ్య, ఎంపిడిఓ శ్రీనాధ్ స్వామి, మైలవరం సీఐ పి రామచంద్రరావు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈసందర్భంగా అడ్డగిరి మాట్లాడుతూ దాత లేనిదే దాతృత్వం లేదన్నారు. కృష్ణారావు లాంటి దాతలను ఇతరులు సైతం ఆదర్శంగా తీసుకుని సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని అధికారులు హితవు పలికారు. సేవాకార్యక్రమాలను స్వచ్చందంగా నిర్వహిస్తున్న కృష్ణారావు దంపతులు ధన్యులని కొనియాడారు.

మొర్రుపల్లి విద్యార్థికి ఐసీడబ్ల్యుఏలో ఐదో ర్యాంకు

మైలవరం, ఫిబ్రవరి 24: మండలంలోని మొర్సుమిల్లి గ్రామానికి చెందిన మోరంపూడి హరినాధ్ సీఎంఏ(ఐసిడబ్ల్యుఏ)లో ఆలిండియాలో ఐదవ ర్యాంకు సాధించాడు. ఈ బాలుడు స్థానిక ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ప్రాధమిక విద్యను అభ్యసించాడు. పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుని ఉన్నత స్థానాన్ని సాధించటం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం జాన్ లాజరస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హరినాధ్‌ను అభినందించారు.