మెయిన్ ఫీచర్

ఆ స్టేషన్‌లో అందరూ మహిళా ఉద్యోగులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భళా భారతీయ రైల్వే!
టిక్కెట్ కలెక్టర్ మొదలుకొని స్టేషన్ సూపరింటెండెంట్ వరకూ, విచారణ కేంద్రంలోని ఉద్యోగి నుంచి స్టేషన్ మాస్టర్ వరకూ ఆఖరికి స్టేషన్‌లోకి
ప్రవేశించే రైళ్ళకు మార్గాలను నిర్దేశించే పాయింట్స్‌మెన్ విధులను కూడా నిర్వహించే వారందరూ మహిళలే !

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేసే సంస్థ భారతీయ రైల్వే. ఈ రైల్వే యాజమాన్యం తరచూ అమలులోకి తీసుకొచ్చే అద్భుతమైన మార్పుల్లో ఒకటి ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని గాంధీనగర్ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగులందరూ మహిళలే కావడం ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
టిక్కెట్ కలెక్టర్ మొదలుకొని స్టేషన్ సూపరింటెండెంట్ వరకూ, విచారణ కేంద్రంలోని ఉద్యోగి నుంచి స్టేషన్ మాస్టర్ వరకూ ఆఖరికి స్టేషన్‌లోకి ప్రవేశించే రైళ్ళకు మార్గాలను నిర్దేశించే పాయింట్స్‌మెన్ విధులను కూడా నిర్వహించే వారందరూ మహిళలే కావడం విశేషం.
మొత్తం 40 మంది వరకూ ఉద్యోగినులు గాంధీనగర్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మరో విశేషమేమిటంటే, జైపూర్ నుంచి ఢిల్లీ వరకు గల ప్రధానమైన రైల్వే మార్గంలో నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ గాంధీనగర్. ప్రతి రోజూ 50 రైళ్ళు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా, వాటిలో 25 రైళ్ళు అక్కడ ఆగుతాయి.
ప్రతిష్ఠాత్మకమైన ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’, ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’లతోపాటు రాజధాని, శతాబ్ది వంటి హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ స్టేషన్ మీదుగానే రాకపోకలు సాగిస్తూ దాదాపు ఏడు వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తాయి.
రైల్వే శాఖలో ఏడాది సర్వీసు పూర్తి చేసిన గాంధీనగర్ స్టేషన్ మాస్టర్ ఏంజెలా స్టెల్లా మాటల్లో,‘సర్వీసులో చేరిన కొత్తల్లోనే అంద రూ మహిళలే పనిచేసే ఇటువంటి ప్రధానమైన స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేయడం ననె్నంతో ఉత్తేజపరుస్తోంది. ఈ ఏడాది కాలంలో ఒక్క నిబంధనను కూడా అతిక్రమించకుండా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రమిశిక్షణతో పనిచేయడం మాకెంతో గర్వకారణం’.
భారతీయ రైల్వే శాఖ అందరూ మహిళలే పనిచేసే స్టేషన్‌ను గత ఏడాది(2017) ముంబాయిలోని మాతుంగాలో ప్రారంభించింది.
ఈ ఉద్యోగినులంతా ఎవరి విధులను వారు నిర్వర్తించడంతోపాటు స్వచ్ఛ్భారత్‌లో భాగంగా స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ‘అరుషి’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో శానిటరీ నాప్‌కిన్స్ విక్రయించే వెండింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి, అందరి ప్రశంసలు పొందారు.
ఇటువంటి మహిళా భాగస్వామ్య ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లోను అమలుపరిస్తే ప్రజలకు సక్రమమైన సేవలు అందడంతోపాటు ఆయా విభాగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనడంలో సందేహం లేదు.

-గున్న కృష్ణమూర్తి