అక్షర

- షోడశి - రామాయణ రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోడశి
తెలుగు మూలం
గుంటూరు శేషేంద్రశర్మగారి
రామాయణ రహస్యములు
ఆంగ్లానువాదం: గురజాడ సూర్యనారాయణమూర్తి;
వెల: రు.400/-;
ప్రతులకు: అన్ని ప్రసిద్ధ
గ్రంథ విక్రయశాలలు.

గుంటూరు శేషేంద్రశర్మగారు బహుగ్రంథకర్త. లోగడ తెలుగులో షోడశి -స్వర్ణహంస వంటి గ్రంథములలో సుప్రసిద్ధులైనారు. కవిగా పరిశోధకునిగా వారి స్థానము ఆధునిక తెలుగు సాహిత్యంలో పదిలము. షోడశి అంటే పరిపూర్ణ చంద్రబింబము. షోడశి అంటే ఒక కుండలినీ మహావిద్య. ఆదిపరాశక్తికి ఒక పేరు. ఇది యోగ సాధకులకు తెలిసిన విషయమే. కాని రామాయణములోని సీత షోడశీ విద్యాసంకేతమని ఎందరికి తెలుసు? రామాయణము పైకి కథాకావ్యంగా కన్పడుతున్నా ఇదొక యోగ శాస్త్రగ్రంథము అని ఎందరికి తెలుసు? త్రిజటాస్వప్నము గాయత్రీ మంత్రసారమని శేషేంద్ర నిరూపించారు. రామాయణంలోని కవితాత్మ కథా కావ్యము మాట అటుంచి చారిత్రక రహస్యములపై పరిశోధన అంతగా జరుగలేదు. శేషేంద్ర ఒక పరిశోధకునిగా తులనాత్మక విశే్లషణా విమర్శకునిగా ఈ పని చేశారు. గురజాడ సూర్యనారాయణమూర్తిగారు పేరెన్నికగన్న శాస్తవ్రేత్త. వారీ తెలుగు షోడశిని ఆంగ్లంలోనికి తీసుకొని వచ్చారు. ఇది ముదావహము. తెలుగు గ్రంథములు. ఆంగ్లంలోకి రాకపోవటంవల్లనే తెలుగు కవులకు రావలసినంత అంతర్జాతీయమైన గుర్తింపురావటం లేదు అనేది అందరకు ఎరిగినదే. షోడశి ఇప్పుడు అంతర్జాతీయమైంది. ఇందుకు అనువాదకులు ప్రచురణకర్తలూ అభినందనీయులు. ఈ గ్రంథము శేషేంద్రశర్మగారి చిన్నకుమారుడు సాత్యకికి అంకితం చేయబడింది. ఆయన పరిశ్రమలవల్లనే ఈ తెలుగు, ఇంగ్లీషు గ్రంథాలు ముద్రణకు నోచుకున్నాయి. అనువాదం చాలా సరళంగా ఉంది. సాంకేతిక పదాలు సందర్భోచితంగా యధాతథంగా సంస్కృత మూలాలనే ఉదాహరించారు. సూర్యనారాయణమూర్తిగారి ప్రతిభనూ శేషేంద్రగారి మనీషను తెలుసుకోవాలని అనుకునేవారు మాత్రమేకాకుండా రామాయణంలోని వాల్మీకి హృదయమును అందుకోవాలని భావించే పరిశోధకులు కూడా ఈ షోడశిని చదవ వలసి ఉంటుంది.

-ముదిగొండ శివప్రసాద్