సబ్ ఫీచర్

ఆశా కార్యకర్తలు కర్తవ్య నిష్టాపరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండు జాబిలిని చూపిస్తూ ఏవేవో ఊసులు చెప్తూ తన రెండేళ్ల కుమారుడికి అన్నం తినిపిస్తోంది. ఓ అమ్మ.. పిల్లాడి బొజ్జనిండా బువ్వెట్టిన అమ్మ తన దిష్టే తన బిడ్డకు తగులుద్దేమోనని చివర్లో ఓ ముద్ద దిష్టిగా తీసి పడేసింది. టౌనుకెళ్లిన భర్త మరుసటిరోజు వరకు రాడు బిడ్డను ఆడించుకుంటూ నిద్రపుచ్చి తానూ నిద్రపోయింది ఆ అమ్మ. అర్థరాత్రి సమయంలో ఆ చంటోడు ఒకటే ఏడుపు. బిడ్డ ఏడుపుని చూసి కడపున తడిమింది.
అయ్యో తన బ ఇడ్డ కడుపునొప్పితో విలవిలలాడుతున్నాడని గుర్తించిన ఆ అమ్మ ఇప్పుడేం చేయాలి దేవుడా అంటూ కంటతడిపెడుతోంది. అప్పుడామె ఒక్కసారిగా లేచి బిడ్డనెత్తుకుని ఊరిలోకి పరుగుపెట్టింది. ఓ ఇంటి వద్దకు చేరుకుని గట్టిగా తలుపుతడుతూ ‘‘లక్ష్మక్కా .. లక్ష్మక్కా..’’అని అరుస్తోంది. ఆ అరుపు విన్న లక్ష్మక్క నిద్రలోంచి లేచి తలుపు తీసింది. ‘‘అక్కా నా బిడ్డ కడుపునొప్పితో తట్టుకోలేకపోతున్నాడు. ఏదైనా టానిక్ ఇయ్యక్కా’’అంటూ కన్నీళ్లు పెట్టుకొంది. ఆ అమ్మ అడగ్గానే చటుక్కున లోపలికి వెళ్లిన లక్ష్మక్క ఓ టానిక్ తీసుకొచ్చి బిడ్డకు తాపింది. ఓ పదినిమిషాలకే ఆ బిడడ తేరుకుని హాయిగా నిద్రపోయాడు. ఆ అర్థరాత్రి సమయంలో కడుపునొప్పితో బాధపడుతున్న ఆ చిన్నోడికి మందు ఇచ్చిన ఆమె ... ఆ గ్రామానికి చెందిన ఓ ఆశాకార్యకర్త. ఆ చంటోడికి వచ్చిన పరిస్థితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో చాలామందికి ఎదురువుతుంటుంది. ఆ సమయంలో బాధను తీర్చే వైద్యురాలిగా అందరికీ అందుబాటులో ఉంటున్నది ఆశాకార్యకర్తలే. పండంటి బిడ్డకు జన్మనిచ్చే అమ్మకే అమ్మలా మారి సేవలందజేస్తున్నారు. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆమె ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా పర్యవేక్ష జరుపుతూనే ఉంటారు. ప్రసవం కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధంగా గర్భిణీలకు అవగాహన చేయిస్తుంటారు. ఇంట్లోనే ప్రసవమైతే 7 సార్లు సందర్శించి తల్లీబిడ్డలకు పోషకాహారం గురించి వివరిస్తూ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేబడుతున్నారు. పెద్ద ఆరోగ్య శాఖ నిర్దేశానుసారం పిల్లలకు అవసరమైన సమయంలోటీకాలు వేయిస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల గురించి అవగాహన కల్పించి భార్య లేదా భర్తను కుటుంబ నియంణ్ర శస్త్ర చికిత్సల గురించి వారికి అవగాహన కల్పిస్తారు. ఈ విషయంలో వారి ఆదాయాన్ని పుట్టబోయే పిల్లల ఆలనాపాలనా పట్ల సరియైన భవిష్యత్తు ప్రణాళిక భార్యాభర్తలు వేసుకొనేలా ఆశాకార్యకర్తలు వారికి అన్ని విధాల సహకరిస్తారు.
గ్రామాల్లో క్షయ వ్యాధిగ్రస్థులకు ప్రత్యక్ష పర్యవేక్షణ పద్ధతిలో మందులందచేస్తారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు గ్రామాల్లో ని పారిశుద్ధ్యం పై తనపై అధికారలకు తెలియబరుస్తూ గ్రామాలలోని ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి ఎల్లవేళలా శమ్రించే వ్యక్తులు ఆశాకార్యకర్తలే.
పారిశుద్ధ చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ వర్కర్లు మిన్నకుండి పోతున్నా పంచాయతీ గ్రామాల్లో దమల నిర్మూలన కోసం అవసరమైతే చీపురు పట్టి చెత్తనూడ్చి మురుగు నీటిని శుభ్రపరిచే పని కూడా చేస్తున్నారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే కాకుండా అంగన్‌వాడి కార్యరక్తలు చేసే పలువిభాగాల పనులకు కూడా ఆశాలను వినియోగించుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, శిశుసంక్షేమశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు పదేపదే చిన్నా చితకా పనులకోసం ముందుగా ఆశాకార్యకర్తలను పిలవండి. ఆచెత్త పనులను వారితో చేయిద్దాం అని ఆశాలను వినియోగించుకోవడం పరిపాటిగా మారింది. అయినా ఎక్కడ కూడా అలుపెరగకుండా తనపై అధికారులు కాలితో చూపితే చేత్తో చేసుకొంటూ ముందుకెళ్తున్నారు ఈ ఆశాకార్యకర్తలు. అనునిత్యం పలుశాఖల అధికారులకు అందుబాటులో ఉండే పనిమనిషిగా మారి ఊడిగం చేయడం అవసరమా అని ఏ ఆశాకార్యకర్తనైనా ప్రశ్నిస్తే.. ఏదో ఓ రోజు ప్రభుత్వం కన్ను తెరవక పోతుందా.. మాపై జాలి చూపి మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా పోతుందా.. అనే ఆశతోనే అన్ని పనులనూ చేస్తున్నాం. అంటూ ఆశాకార్యకర్తలు బరువెక్కిన గుండెతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ దీపం వెలగేటప్పుడు తన చుట్టూ చీకటి ఉన్నా కాస్త దూరంగా ఉన్న ప్రదేశంలో వెలుగునివ్వడం చూస్తుంటాం. అదేవిధంగా ఏ అధికారి చెప్పినా వారి మాట జవదాటకుండా వెట్టిచాకిరె చేస్తూ చాలీ చాలని గౌరవ వేతనాలతో సమస్యల చీకటిలో మగ్గుతున్న ఆశాకార్యకర్తల జీవితాల్లో వారి ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యి వెలుగు నిండాలనే వారి ఆశ నిజమవ్వాలని ఆకాంక్షిద్దా. కోరుకుందాం. ఆ దిశగా మనమూ మనవంతు బాధ్యతను నెరవేరుద్దాం.

-ఎస్. బాబ్‌జాన్ 9492722595