ఈ వారం కథ

అసూయ అక్కర్లేనిది (అనగనగా..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా! నా బెస్ట్‌ఫ్రెండ్ సౌమిక్ వాళ్ళు మన వీధిలోని చివరింటికి మారుతున్నారు. ఇకమీదట మేము ఒకరిళ్ళకి ఒకరం వెళ్ళచ్చు. స్కూల్‌లో పక్కపక్కనే కూర్చోవచ్చు. వాడికి కూడా నాలాగే ఉప్మా అంటే ఇష్టం’’ స్కూల్ నుంచి ఇంటికివచ్చిన రీనీ ఆనందంగా చెప్పింది.
రీనీ తల్లి నవ్వుతూ గినె్నలోని వేడి వేడి ఉప్మాని ప్లేట్‌లో పెట్టి ఇస్తూ చెప్పింది.
‘‘నీకు, సౌమిక్‌కి చాలా విషయాలు కలవడం నాకు ఆనందంగా ఉంది’’.
రెండు రోజుల తర్వాత స్కూల్ నుంచి వచ్చిన రీని తల్లి అడిగింది.
‘‘మీ ఇద్దరూ బస్‌లో పక్కపక్కనే కూర్చున్నారా?’’
‘‘లేదు. సౌమిక్ ఇక నా బెస్ట్‌ఫ్రెండ్ కాదు.’’
‘‘ఎందుకు? ఏమైంది?’’ తల్లి ఆశ్చర్యంగా అడిగింది.
‘‘నేను నిన్న సౌమిక్ ఇంటికి వెళ్తే వాడు నాతో ఆడకుండా కియాతో షటిల్ ఆడాడు. బెస్ట్‌ఫ్రెండ్స్ కలిసి ఆడుకోవాలి కదా?’’
ఆ రాత్రి తన కంచెంలో ఉప్మా, మిగిలిన అందరి కంచాల్లో అన్నం ఉండటం చూసి, రీనీ ఆశ్చర్యంగా అడిగింది.
‘‘ఇదేమిటి? నాకు అన్నం లేదా?’’
‘‘ఉప్మా అంటే నీకు ఇష్టం కాబట్టి ఇకనుంచి నీకు అన్ని పూటలా ఉప్మానే పెట్టదలచుకున్నాను’’.
‘‘అవును. అమ్మ నన్ను నీ కోసం ఐదు కిలోల ఉప్మా రవ్వ కూడా తీసుకురమ్మంది’’ తండ్రి రీనీతో చెప్పాడు.
‘‘నాకు ఎప్పుడూ ఉప్మానే వద్దు. మిగిలినవి కూడా నాకు ఇష్టం. నువ్వెందుకిలా చేస్తున్నావు?’
తల్లి నవ్వి చెప్పింది.
‘‘నీకు ఆహారంలో వెరైటీ ఇష్టమైనపుడు స్నేహంలో కూడా వెరైటీ ఇష్టం ఉండాలి. సౌమిక్కే కాక నీకు ఇతర స్నేహితులు ఉన్నట్లే వాడికీ వేరే స్నేహితులు ఉండటంలో తప్పులేదు’’.
‘‘అమ్మ చెప్పింది నిజమే. సౌమిక్ విషయంలో నీ ఆలోచన తప్పు. నీకున్నట్లుగానే వాడికీ ఒకరికంటే ఎక్కువమంది స్నేహితులు ఉండే స్వేచ్ఛ ఉంది. నీది అసూయ అంటారు. అది మంచిది కాదు’’ తండ్రి చెప్పాడు.
‘‘నేను అలా ఆలోచించలేదు. మీరు చెప్పింది నిజమే. నేను సౌమిక్ దగ్గరికి వెళ్లి సారీ చెప్తాను’’ రీనీ చెప్పింది.
‘‘అది మంచి పని. కాని ముందుగా అన్నం తిని వెళ్ళు’’ తల్లి నవ్వి చెప్పింది.
.....................................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

మల్లాది కృష్ణమూర్తి