నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ పచ్చి చర్మపుతిత్తి పసలేదు దేహంబు
లోపల నంతట రోయరోత
నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త
మాంసపు కండల మైలతిత్తి
బలువైన యెండ వానల కోర్వదింతైన
తాళలేదాకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమైయుండు
నిలువ దస్థిరమైన నీటిబుగ్గ
తే॥ బొందిలో నుండు ప్రాణముల్ పోయినంతఁ
గాటికేగాని కొఱగాదు గవ్వకైన
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నరసింహ ప్రభూ! ఈ శరీరం మెత్తని చర్మంతో చేయబడ్డ తోలు సంచి. ఇందులో ఎలాటి సారం లేదు. లోపల చూద్దామా అంటే అంతా అసహ్యమే. నరాలు, ఎముకలు, తొమ్మిది చిల్లులు, మాంసం, కండలు గల్గిన మైలతిత్తి ఇది. ఆకలి దప్పులకు తాళలేదు. అన్ని రోగాలకు పుట్టినిల్లు. అంతరించిపోయే నీటిబుగ్గ. ఈ బొందిలో ప్రాణాలు అంతరించిన తర్వాత, ఈ శరీరం కాటికేగాని గవ్వకైనా పనికిరాదు.