Others

సుమధుర రామాయణం .. అయోధ్యా కాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

97. అట్లు శపథము జేసి రామానుజుండు
పాదుకల భక్తితో తలపై ధరించి
అన్న అనుమతి వడసి శతృఘు్న తోడ
అరద మెక్కెను తిరిగి కోసలను జేర

98. రామచంద్రుడు గురుజనంబులకు మంత్రి
వరులకును వందనమ్ము లొనర్చి పరిజ
నముల వీడ్కొల్పి గద్గద గాత్రుడౌచు
తల్లులకు మ్రొక్కి యాశ్రమ మందు జొచ్చె

99. భరతు డంతటి ముని భరద్వాజ నాశ్ర
మంబునకు పాద చారియై జని మహర్షి
పాదముల కతి భక్తినమస్కరించె
రాముడేమనె భరత కుమార యనగ

100. అన్న దృఢ నిశ్చయమ్మును దెల్పె మునికి
గురువసిష్ఠులర్ధించిన గాని తండ్రి
వాక్య పాలన దీక్షను విడువ ననుచు
పాదుకలనుగ్రహించె నేవేడు కొనగ

101. పాదుకలే పరిపాలించు కోసలమును
అన్న సేవతో తరియింతు నింకనేను
అనిన భరతుని భాతృ భక్తికి మహర్షి
పరవశించెను పురుష శ్రేష్టుండటంచు

102. ముని భరద్వాజునకు వందనము లొనర్చి
పయన మయ్యెను భరతు డయోధ్య దిశగ
పట్టణంబులు పల్లెలు నాశ్రమములు
గడిచి చేరిరి స్వీయ దేశమున కపుడు
103. అన్నలేని యయోధ్యలో నుండ నొల్ల
ని భరతుడు గురువరు ననుమతిని వడసి
నంది గ్రామము జేరి సింహాసనమున
పాదుకల నుంచి భక్తి పట్టంబు గట్టి

104. నార చీరెలు ధరియించి కందమూల
భక్షణము జేయుచును మునివృత్తి తోడ
వనము నందున్న నగ్రజువలె గడుపుచు
రామసేవగా రాజ్యపాలన మొనర్చె

105. భరతు డేగిన పదపడి నటవసింప
తరము గామికి రామాదులత్రివౌని
యాశ్రమము జేరి తమ కుల గోత్రములను
దెల్పి మ్రొక్కిన యానందమంది వౌని

106. జానకీరాముల సుమిత్రసూను వౌని
వుచిత రీతిని అతిథి పూజల నొనర్చె
గురుతపస్విని కనసూయకు ప్రణామ
ములనొనర్చిరి భక్తి ప్రపూర్ణులౌచు

107. జానకి నడిగె ననసూయ దాశరధికి
నీకు పరిణయ మెట్లుయ్యె నాకు జెప్పు
మనగ శివదనుర్భంగ మొనర్చి రాఘ
వుండు పెండ్లి యాడుట జెప్పె బిడియ పడుచు

108. సాధ్వి అనసూయ అత్రి మహర్షి పత్ని
సీతకు నొసంగె నంగరాగముల నెల్ల
యెపుడు తరగని శోభతో నుందువనుచు
ధరజ నాశీర్వదించియా వృద్ధమాత

టంగుటూరి మహాలక్ష్మి