సరైనోడి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న నటుడు అల్లు అర్జున్. సినిమా సినిమాకూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇటీవలే సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోగా ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమాలో మరో విశేషం వుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గాయకుడిగా మారుతున్నాడు. ఈమధ్య తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు సింగర్స్‌గా తమ సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే రవితేజ, ఎన్టీఆర్, పవన్‌కళ్యాణ్ గాయకులుగా అలరించారు కూడా. తాజాగా ఈ లిస్టులోకి అల్లు అర్జున్ చేరాడు. సరైనోడు చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్, అల్లు అర్జున్‌తో ఓ పాట పాడిస్తున్నాడట. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తిచేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు డాన్సులు, నటనతో ఆకట్టుకున్న బన్నీ ఈసారి గాయకుడిగా ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘సరైనోడు’ చిత్రంలో అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే నెలలో పాటలను విడుదల చేసి ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.