Others

సుమధుర రామాయణం .. అయోధ్యా కాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

109. పతిని మించిన ప్రియబాంధవుండుగాని
భర్త సేవకు మించిన తపము గాని
లేవు మరువకు మమ్మ ఈ ధర్మ పథము
ననుచు బోధించె ననసూయ నిలజ కపుడు

110. వృద్ధ దంపతులకు భక్తి పూర్వకముగ
వందనములిడి మువ్వురనుజ్ఞ వేడి
దండకారణ్యమున పయనింప నచటి
బ్రహ్మవేత్తలుప్పొంగుచు రాముగనిరి

111. తమ్మునితో సహధర్మ చారిణితొ వచ్చు
రాముగని రనిమేషులై ఋషి జనంబు
లంత కర్తవ్యనిష్టులై వారి కతిధి
పూజ లొనరించి రచల చిత్తములతోడ

112. వారి పూజ లాదరముతో స్వీకరించి
మందహాసముతో విశ్రమించియున్న
దుష్టశిక్షకు శిష్టరక్షుకుని రామ
చంద్రు జేరి వౌనులు విన్నవించు కొనిరి

113. రాఘవా జితక్రోధుల వౌచు మేము
శాపదండంబు వీడి ఈ విపిన భూమి
తపము నార్జించు మాకు రాక్షసుల బాధ
తొలగ జేయగా మాకు దిక్కీవె యనిరి

114. తపసి వరులకు రాఘవుండభయ మొసగి
వన్య మృగ క్రూర రాక్షస నిలయమైన
దండకారణ్య మంద ప్రమత్తులౌచు
పయనమును జేయ ఘోర విరాధు డపుడు

115. సీత నపహరింప రఘు సత్తముండు
నాగ్రహంబున నేత్రము లెఱ్ఱవార
రాక్షసాధమ నిలుమంచు నవ్విరాధు
యేడు బాణము లేదనాట నేసినంత

116. క్రింద బడినాడు జావక సీత నొదలి
భీకరంబుగ నరచుచు రామలక్ష్మ
ణులను బట్టుక బరువిడె నడవిలోని
కిలజ భయమున నార్తనాదమును జేసె

117. రామ సౌమిత్రు లేక కాలమున వాని
భుజములను తెగటార్చగ భూమి బడియె
వివశుడై పూర్వ జ్ఞానము పొంది వారి
దాశరథులుగ గుర్తించి సవినయముగ

118. దశరథాత్మజులార నే పూర్వజన్మ
మందు గంధర్వు డను పేరు తుంబురుండు
అస్త్ర శస్తమ్రులతొ నాకు జావు గల్గ
కుండ వరమిచ్చె నజుడు నా తపము మెచ్చి

119. గర్వమున నేను రంభను గలియబూన
యక్షపతి శాప మిచ్చె నిట్లైతి నేను
శాపమోక్షము నీవు గల్గింతువనుచు
జెప్పె నే వేడు కొనగ నజుండు రామ

120. గోతిలో పూడ్చ మృత్యువు గల్గునాకు
మీరలేగుడి శరభంగు నాశ్రమమున
కతడు మీకన్ని శుభము లనుగ్రహించు
ననుచు దెల్పె గంధర్వుడు రఘువరునకు
*