బిజినెస్

రూ. 40 వేల కోట్లు దాటిన సెజ్ ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఇజెడ్) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో డిసెంబర్ నెలాఖరునాటికి రూ. 40,565 కోట్ల మేర ఎగుమతులు చేసినట్టు జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శోభన కెఎస్ రావు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించే క్రమంలో విశాఖ ఎస్‌ఇజెడ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 46 ఎస్‌ఇజెడ్‌లు ఉన్నాయని, వీటి ద్వారా గతేడాది రూ. 44,998 కోట్ల మేర ఎగుమతులు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకూ ఎస్‌ఇజెడ్‌లలో రూ. 43,598 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 2,36,611 మందికి ఉపాధి లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 ఎస్‌ఇజెడ్‌లు ఉన్నాయన్నారు. వీటిలో అత్యధిక శాతం ఉత్పత్తి ఆధారిత సెజ్‌లేనని తెలిపారు.
రాష్ట్రంలో గతేడాది రూ. 7,883 కోట్ల మేర ఎగుమతులు సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ. 7,863 కోట్ల మేర ఎగుమతులు జరిగాయన్నారు. రాష్ట్రంలోని ఎస్‌ఇజెడ్‌లలో ఇప్పటివరకూ రూ. 23,252 కోట్ల పెట్టుబడులు రాగా, 53,622 మందికి ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలోని ఎస్‌ఇజెడ్‌లలో అత్యధిక శాతం ఫార్మా, టెక్స్‌టైల్స్, అపెరల్, గ్రానైట్, లెదర్ పరిశ్రమలు ఉన్నాయని వివరించారు. ఎస్‌ఇజెడ్ ఎగుమతుల్లో అగ్రస్థానం ఫార్మా రంగానికి సంబంధించినవేనన్నారు. ఇక ఎస్‌ఇజెడ్‌లలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని, సుమారు 5,427 హెక్టార్ల భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే దాదాపు 1.5 లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలం కూడా ఎస్‌ఇజెడ్‌లలో అందుబాటులో ఉందని తెలియజేశారు. ఎస్‌ఇజెడ్‌లలో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వౌలిక సదుపాయాల కల్పన సంస్థ హైదరాబాద్‌లో యాపిల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సుమారు 1.35 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టనుందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సదుపాయాలపై జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.