కృష్ణ

ఎస్సీ, ఎస్టీల సమస్యలకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 7: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తోందని కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సమావేశమైన కమిషన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నుండి అర్జీలు స్వీకరించింది. ఈసందర్భంగా చైర్మన్ శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ సక్రమంగా అమలుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలుత పట్టణంలోని నారాయణపురం యానాదుల కాలనీని సందర్శించి కమిషన్ చైర్మన్ శివాజీ యానాదుల దయనీయ స్థితిపై చలించిపోయారు. చాలామందికి గ్యాస్ కనక్షన్లు లేకపోవటం, ఓటుహక్కు లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్ అండ్ బీ అతిథిగృహంలో కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను కాలనీకి పంపి అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 10 మంది యానాదులకు దీపం పథకం కింద అప్పటికప్పుడు గ్యాస్ కనక్షన్లను మంజూరు చేసి శివాజీ చేతులమీదుగా పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌డి సుబ్బారావు, కమిషన్ సభ్యులు నల్లగట్ల సుధారాణి, కె రాజారావు, కె నరహరి వరప్రసాద్, బి రవీంద్ర, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, డీఆర్‌ఓ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.