రాష్ట్రీయం

‘సప్తమి’లో సడేమియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 14: సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో నిర్వహిస్తున్న రథసప్తమి ఉత్సవాన్ని అత్యాధునిక కెమెరాలతో అనధికారికంగా చిత్రీకరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. వీరు చిత్రపరిశ్రమకు చెందిన టెక్నీషియన్లుగా గుర్తించారు. పట్టుబడ్డవారిని అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసే విజయవాడకు చెందిన నిశాంత్, సిహెచ్ సాయికిషోర్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. తొలుత వారిని ఎలక్ట్రానిక్ మీడియాకు చెందినవారిగా విజిలెన్స్ అధికారులు భావించారు. ఒక దశలో వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి నిలదీయగా చిత్ర పరిశ్రమకు చెందినవారమని అంగీకరించారు. వీరు మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా యూనిట్‌కు చెందినవారని తెలుస్తోంది. అయితే వారిని రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వదిలివేశారు. ఇదేమని విలేఖరులు ప్రశ్నిస్తే అనుమతి లేకుండా చిత్రీకరించకూడదని వారికి తెలియక ఈ పొరబాటు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని దీంతో అధికారుల అనుమతి మేరకు వారిని వదిలివేసినట్లు ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు.