వీరాజీయం

శీతల మృత్యు గహ్వరం సియాచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచిన్’’అంటే స్థానిక భాషలో గులాబీల తోట! బహుశః మృత్యుదేవతకది గులాబీల తోటయ్యుంటుంది! సైనికులకది మృత్యు గహ్వరమే... ప్రపంచం మొత్తం మీద అత్యున్నత అత్యంత శీతల సైనిక స్థావరం అదే! సముద్ర మట్టానికి ఐదువేల ఏడువందల యాభై మూడు మీటర్ల ఎత్తున వున్న రుూ మంచు శిఖరం మీద అకస్మాత్తుగా చెలరేగే మంచు తుఫానుల వేగం గంటకి 160 కిలోమీటర్లుంటుంది.
సియాచిన్ స్థావరాన్ని 1984లో పాక్ సైన్యాలను తరిమికొట్టి ఆక్రమించుకున్న మన పదాతి దళం- వీరజవాన్‌లు అప్పటినుంచీ, అహర్నిశలూ కాపలా కాస్తూనే వున్నారు. ఈ నిర్జీవ నిబిడీకృత మంచు పర్వతశ్రేణి స్థావరం యొక్క వైశాల్యం వెయ్యి కిలోమీటర్లు వుంటుంది. కానీ, సియాచిన్ అన్నది వాస్తవానికి ఒక నది (హిమానీనదం). అది ఒక డెబ్భయి అయిదు కిలోమీటర్ల నిడివిగలది గడ్డకట్టుకుపోయి ఒక దిబ్బలాగా మారింది. ఇక్కడ మంచు లోతు కొన్ని వందల అడుగులుంటుంది. అక్కడ మన వీర జవాన్లు- సాల్టోరో కనుమల మధ్య గస్తీకాస్తూ అటు కోరం శ్రేణికవతల కాస్త దిగువగానున్న విడిసిన పాక్ సేనని ఒక్క సెంటీమీటర్ కూడా ఎగబడి రాకుండా నిలవరిస్తున్నారు. పాకిస్థాన్ సేన ‘‘కోండూజ్’’ మంచుదిబ్బ మీద యిదే అవస్థలు పడుతూ వుంటున్నారు. ఇక్కడ 1984కి- 2003కీ మధ్య యిరుపక్షాల మధ్య అనేక ఘర్షణలు చెలరేగినా, భారత్ జవాన్లదే పైచెయ్యి. 2003 నవంబర్ 26న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఇరవై రెండువేల అడుగుల ఎత్తునగల రుూ స్థావరాన్ని - వూపిరి పీల్చుకోడానికి తగినంత ప్రాణవాయువు కూడా లేకపోయినా ప్రాణాలు అరచేత బెట్టుకుని- మృత్యువుతో ముచ్చట్లాడుతూ మన ‘‘మద్రాసు రెజిమెంటు’’కు చెందిన కాల్బలం దేశప్రతిష్ఠకోసం- కాపలాకాస్తున్నది. ఈ ప్రాంతానికి రాకపోకలేమిటి? హెలికాఫ్టర్లు కూడా దిగలేవు. కొంచెం క్రిందుగా వున్నదో ‘‘హెలిపాడ్. అది కూడా ప్రపంచం మొత్తంమీద అతి ఎత్తయిన హెలీప్యాడ్. హెలికాప్టర్ వచ్చి అది ఎగురుతూ జారవిడిచే ఆహారం, మందుగుండు, కిరసనాయిలు వగైరాలను వీర జవానులు వచ్చి ఏరుకుని తీసుకుపోడానికి’’ మంచు స్కూటర్లమీద వస్తారు.- అంతా నిర్జీవం కదా- అంతా మంచుగడ్డలే; అటువంటిచోట వస్తుసేకరణ కార్యక్రమంలో- పది మంది సైనికులు నిమగ్నులై వుండగా- అక్కడ మంచుతో కట్టిన పదడుగుల గోడ కుప్పకూలి పోయింది. దాని క్రింద పడిపోయిన వీరజవాన్‌ల మీద ముప్ఫయి అడుగుల ఎత్తున మంచు దిమ్మలు- కొన్ని టన్నుల బరువుగలవి పడిపోయినాయి. తొమ్మిది మంది సజీవ సమాధి అయిపోయారు. అందులో ఒకడయిన ‘‘హనుమంతప్ప కొప్పాడ్’’ కొన వూపిరితో ఢిల్లీకి తీసుకుని రాబడ్డాడు. నిజానికి అక్కడ అప్పుడప్పుడు వచ్చే మంచు తుఫాన్లకు- యిప్పటికి కొన్ని వందల మంది సైనికులు సజీవ సమాధియై పోయారు- అమరవీరులైపోయారు.
ఇదే విధంగా పాకిస్థాన్ వైపుకూడా జవాన్ల దుర్మరణం సంభవిస్తూనే వుంది. ఈ నిర్మానుష్య నిర్జీవ నిబిడీకృత మంచుకొండల మీద మనం సైనికుల్నిపెట్టి పహరా యివ్వడానికి శ్రమమాట అటుంచండి పైకం కూడా ఖర్చవుతున్నది. ఒక్క రోజుకి నాలుగునుంచి ఏడు కోట్ల రూపాయల ఖర్చుఅవుతున్నది. అయినా ఆహారం, దుస్తులూ, తుపాకులూ అవీ చేరవేయడం సీజన్ బాగున్నప్పుడే- ఒక్కోసారి కొన్ని వారాలపాటు- ప్రపంచంతో రుూ స్థావరానికి సంబంధం తెగిపోతుంది.
పాకిస్తాన్, భారతదేశాల మధ్యగల రుూ మంచు శిఖరాలలో మనవాళ్లు మొదట్నుంచీ లేరుగానీ పాకిస్తాన్ తన వైపునుంచి యిక్కడ వ్యాపారం చేసేసుకుంటుంది. చైనా వాళ్లకి కొంతమేర ధారాదత్తం చేసేసింది కూడా. దాంతో మనం వాళ్లను తరిమివేసి, సియాచిన్ మృత్యుదిబ్బమీద కాపలా మొదలెట్టాం.
ఈ ప్రాంతంలో పర్మెనెంటుగానే ఒకే బ్యాచ్ కాకుండా 90రోజులకోసారి మారిపోతూంటారు. కానీ, రుూలోగా ఆ బ్యాచ్‌కి ట్రయినింగ్ యివ్వటానికి రెండు నెలలు- అక్కడికి చేరడానికి కొన్నివారాలు పడుతుంది- నిజానికి యిరు దేశాలకీ యిది సంకటమే. పాకిస్తాన్ తన షరతుల మీద రాజీ పడకపోవడంతో - యిప్పటిదాకా సియాచిన్, ఇండోపాక్‌ల మధ్య ‘‘మృత్యుకంచె’’గా వుండిపోయింది. శత్రువుల మధ్య పచ్చగడ్డికూడా మొలవదు అన్నట్లుగా వున్నదక్కడ- యంతా ఐసుగడ్డలే...
2005లో అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్‌గారు రుూ ప్రాంతాన్ని సందర్శించాడు. దీన్ని నిర్మానుష్యంగా వదిలి- ఒక ‘శాంతిపార్క్’లాగా నిభాయిస్తే బాగుంటుంది అన్నాడు. కానీ అది సఫలం కాలేదు. ఇప్పుడు హనుమంతప్ప మన కళ్లముందు- కొంచెం కొంచెంగా మృత్యుదేవతకు బలైపోతూంటే- అందరూ సియాచిన్‌ని మనుషులు లేని ప్రాంతంగా వదిలివేయడం ‘‘బెటర్’’అని అంటున్నారు.
పాకిస్తాన్ హైకమిషనర్ బాసిత్ మియాఁకూడా దీనికి పిలుపునిచ్చాడు. ఎంత త్వరగా వీలయితే అంత వేగంగా రుూ ‘గ్లాసియర్’ని వదిలిపెట్టి- యిరుపక్షాలూ- ఆధునిక సాంకేతిక ఆకాశ పర్యవేక్షణ లాంటిది ఏర్పాటుచేసుకోడం మంచిది. యుద్ధంచేస్తూ విజయమో- వీరస్వర్గమో పొందడం వేరు. యిలా అనామక దుర్మరణం చెందడం వేరు-
బెటర్ బోత్‌సైడ్స్ లీవిట్ ఏజే పీస్ పార్క్!