బిజినెస్

చివరలో అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెషన్ ఆరంభంలో లాభాలను ఆర్జించినప్పటికీ చివరలో అమ్మకాల ఒత్తిడికి లోనయి కీలక సూచీలు స్వల్పంగా దిగజారాయి. కొన్ని ఉక్కు, అల్యూమినియంల దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం (గ్లోబల్ ట్రేడ్ వార్) మొదలవుతుందనే ఆందోళన నెలకొనడంతో లోహ రంగాల కంపెనీల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం క్రితం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్లు దిగజారి, 33,307.14 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 16 పాయింట్లు పడిపోయి, 10,226.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. కొన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించడానికి సంబంధించిన ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో శుక్రవారం నాటి లావాదేవీల్లో బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ భారీగా పతనమయింది. అమెరికా తీసుకున్న చర్యపై ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతాయేమోనన్న ఆందోళన మదుపరులలో నెలకొనడంతో లోహ రంగాల షేర్లను వదులుకోవడానికి వారు ఎగబడ్డారు. శుక్రవారం సెషన్‌లో అత్యధిక భాగం సానుకూల ధోరణిలోనే సాగిన సెనె్సక్స్ 33,519.49 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, సెషన్ చివరలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో పడిపోయిన ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 44.43 పాయింట్ల (0.13 శాతం) నష్టంతో 33,307.14 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10,296.70- 10,211.90 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 15.80 పాయింట్ల (0.15 శాతం) నష్టంతో 10,226.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, గురువారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 364.80 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 675.26 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోవడం వరుసగా ఇది రెండో వారం. ఈ వారంలో సెనె్సక్స్ 739.80 పాయింట్లు (2.17 శాతం) పడిపోగా, నిఫ్టీ 231.50 పాయింట్లు (2.21 శాతం) పడిపోయింది.
శుక్రవారం నాటి లావాదేవీల్లో మెటల్ రంగాల కంపెనీలలో సెయిల్ అత్యధికంగా 6.40 శాతం నష్టపోయింది. జిందాల్ స్టీల్ 5.24 శాతం, టాటా స్టీల్ 4.66 శాతం, నాల్కో 2.19 శాతం, ఎన్‌ఎండీసీ 1.85 శాతం, వేదాంత 1.59 శాతం, హిండాల్కో 1.26 శాతం చొప్పున నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల పతనం శుక్రవారం కూడా కొనసాగింది. యాక్సిస్ బ్యాంక్ 2.85 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.43 శాతం, యెస్ బ్యాంక్ 1.41 శాతం, ఎస్‌బీఐ 1.40 శాతం, పీఎన్‌బీ 1.24 శాతం చొప్పున నష్టపోయాయి. నష్టపోయిన ఇతర సంస్థల్లో అదాని పోర్ట్స్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.21 శాతం వరకు పడిపోయింది.