బిజినెస్

ఏపీపై అప్పుల భారం రూ.2.22 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్ర నుంచి తగిన నిధుల కేటాయింపు లేకపోవడం, సోంతంగా నిధులు ఆశించిన మేర సమకూరకపోవడంతో నానాటికీ అప్పుల భారం పెరిగిపోతోంది. కాగా తలసరి ఆదాయంలో మాత్రం వృద్ధి నమోదు కావడం విశేషం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తాజాగా అప్పుల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 96 వేల కోట్ల రూపాయలు మేర అప్పు ఉంది. 2016-17 సంవత్సరం ప్రారంభం నాటికి 1.96 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆ మొత్తం 2.16 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన బడ్జెట్ అంచనాల్లో ప్రకారం రాష్ట్ర అప్పు 2.22 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి ఆ అప్పు 2.49 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పు 6 వేల కోట్ల రూపాయల మేర పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో వివిధ పద్దుల కింద ఆశించిన మొత్తం సమకూరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్‌లు లక్ష్యం మేరకు వచ్చే అవకాశం ఉన్నా, మిగిలిన పద్దుల కింద ఆశించిన రాబడి ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రం సొంతంగా సమకూర్చుకునే పన్నుల్లో 11890 కోట్ల రూపాయలు, పనే్నతర పద్దుల కింద 1150 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి పన్నుల వాటా కింద 6365 కోట్ల రూపాయలు, గ్రాంట్‌ల కింద దాదాపు 12 వేల కోట్ల రూపాయలు మరో మూడు వారాల్లో రావాల్సి ఉంది. ఆదాయంలో తగ్గుదల అప్పులపై ప్రతిబింబించనుంది.
కేంద్ర నిధుల వాటా ఎక్కువ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద 1.55 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. ఇందులో కేంద్రం నుంచి 84,626 కోట్ల రూపాయల మేర నిధులు వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 33,930 కోట్లు, గ్రాంట్‌ల కింద 50,696 కోట్ల రానుంది. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 54 శాతం మేర కేంద్ర నిధులు వస్తాయని బడ్జెట్‌లో పొందుపరిచారు.
పెరిగిన తలసరి ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. 2016-17లో 1,23,664 రూపాయలు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,42,054 రూపాయలకు చేరింది. సంవత్సర కాలంలో 18,390 రూపాయలు పెరగడం విశేషం. దేశ తలసరి ఆదాయం గత సంవత్సరం 1,03,870 రూపాయలు కాగా, ప్రస్తుత సంవత్సరంలో 1,12,764 రూపాయలకు చేరింది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం.