బిజినెస్

1నుంచి ఆన్‌లైన్‌లోనే ట్రెజరీ లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: వివిధ రకాల బిల్లుల ఆమోదం కోసం ఇక ప్రభుత్వ శాఖల నుంచి ఎవరూ కూడా బిల్లులు చేతిలో పెట్టుకుని ట్రెజరీ కార్యాలయాలు, ఆపై టోకెన్‌లతో ఎస్‌బీఐ, ట్రెజరీ, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తొలగిపోతున్నది. వాస్తవానికి బ్రిటీష్ కాలం నుంచి కూడా ఉద్యోగుల జీతాలు, టీఏ బిల్లుల నుంచి కార్యాలయ అద్దెలు, ఫోన్, విద్యుత్, ఇతరత్రా అన్ని రకాల బిల్లులకు నగదు కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి ఒక ఉద్యోగి బిల్లులను చేత పట్టుకుని సంబంధిత ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇక అక్కడ పలువురు చేతులు తడిపితే కాని సంబంధిత బిల్లు టోకెన్ చేతికి వచ్చేది కాదు. మళ్లీ ఆ టోకెన్‌తో నగదు కోసం ఎస్‌బీఐ, ట్రెజరీ, బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ట్రెజరీ శాఖ నూతన సంచాలకులు మోహనరావు తదితరులు కొత్త వ్యూహరచన చేశారు. దీనిపై రిటైర్డ్ ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు, మరికొందరు అధికారులు దాదాపు 14 మాసాలపాటు జర్మనీ దేశంలో అమలవుతున్న విధానాన్ని గుర్తించి ఆ ప్రకారం నూతన టెక్నాలజీని రూపొందించారు. దీనిప్రకారం ప్రభుత్వ కార్యాలయాల నుంచి బిల్లులను ఆన్‌లైన్‌లో సమీప ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తే, వెంటనే అక్కడ నుంచి ఎస్‌బీఐ, ట్రెజరీ కార్యాలయానికి వెళ్లటం ఆపై సంబంధిత బ్యాంక్ ఖాతాలకు సొమ్ము జమకావటం చకచకా జరిగిపోతున్నాయి.
ఈ విధానంలో ‘్ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్’ను పాటించాల్సి ఉంది. ముందుగా వచ్చిన బిల్లును ముందుగా బ్యాంక్‌లకు పంపించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ట్రెజరీల్లో చెలానాల విధానం తొలగించారు.