బిజినెస్

మరో మూడు రోజులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కార్తీ చిదంబరంను మరో మూడు రోజులు కస్టడీలో ఉంచుకొని ఇంటరాగేట్ చేసేందుకు ప్రత్యేక కోర్టు శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అనుమతి ఇచ్చింది. మరోవైపు, ఢిల్లీ హైకోర్టులో కార్తీ చిదంబరంకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరంను ఈ నెల 20 వరకు అరెస్టు చేయొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడయిన కార్తీ చిదంబరంకు మనీలాండరింగ్ కేసులో కాస్త ఊరట లభించినప్పటికీ, అతడిని మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సునిల్ రాణా ఆదేశాలు జారీ చేశారు. కార్తీ చిదంబరంకు సంబంధం ఉన్న చెన్నయిలోని అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కార్తీ చిదంబరం నేరానికి పాల్పడినట్లు వెల్లడించే కొన్ని పత్రాలు, సీడీని స్వాధీనం చేసుకున్నామని, అందువల్ల అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు తమకు అప్పగించాలని సీబీఐ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ.. కార్తీని అరెస్టు చేయకుండా న్యాయమూర్తులు ఎస్.మురళీధర్, ఐఎస్ మెహతాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటలకే అతడిని మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి రాణా ఆదేశాలు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసే అధికారం ఉందనే అంశంపై వచ్చే విచారణ తేదీ రోజున తనకు సంతృప్తి కలిగేలా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అయితే, గత తొమ్మిది రోజులుగా సీబీఐ కస్టడీలో ఉండి, విచారణను ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. కార్తీ చిదంబరంను ఈ నెల 12న తన ఎదుట హాజరు పరచాల్సిందిగా సీబీఐని ఆదేశించారు.