భక్తి కథలు

ప్రేమతో విశ్వాన్ని గెలవొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగ .. శత్రుత్వం.. విరోధం వీటి గురించిన జ్ఞానం మనకు మహాభారతం ఇస్తుంది.
భీష్ముడు జ్ఞానవంతుడు,. లోకతత్వం, లోకరీతి తెలిసిన వాడు. ఆయన ఒకసారి విరోధం గురించి చెబుతూ శత్రువు అనేవాడు బయట ఎక్కడో ఉండడు. మనిషికి అజ్ఞానమే పగ. మనిషి మనసే శత్రువు. ప్రతినిముషం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒకటి కావాలని అంటుంది. దానికోసం వెతకడం ఆరంభిస్తే సంపాదన ఆరంభిస్తే ఒకదానితో ఆ కోరిక తీరదు. ఒకదాని వెంబడి మరొకటి వస్తూనే ఉంటుంది. కోరికలు మితం లేదు. కోరికలను పుట్టించే మనసు దీనికి కారణం. కనుక మనసు ఒకవిధంగా మనిషికి శత్రువే. కాని ఈ మనసును అదుపు చేసుకొంటే మనసు కన్నామంచి మిత్రుడు ఉండడు. ఎప్పుడూ బుద్ధి చెడు దారిలో పోతున్నా మనసు మాత్రం ఇది నీకు చెడు దారి అని చెప్పనే చెబుతుంది. అది వినక బుద్ధి చెప్పినట్లు నడుచుకుంటే మనిషి అధోగతి పాలవుతాడు.
ధర్మవిరుద్ధమైన పనులన్నీ అజ్ఞానంతో కూడుకున్నవే. అసత్యం, అధర్మమూ చేయడం ఆరంభిస్తే అజ్ఞానంలో ఇరుక్కుపోవడం ఏమాత్రం కఠినం కాదు.
ఒక్కసారి అజ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా పెద్దల ద్వారానో, లేక మంచి మాటలు వినడం ద్వారానో అదీలేకపోతే మంచి పుస్తకం చదవడం ద్వారానో దూరం చేసుకొంటే జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఒక్కసారి జ్ఞానముదయించిన తరువాత అజ్ఞానపు ఛాయ కూడా ఉండదు. దీపం వెలిగించిన వెంట వెంటనే మెల్లమెల్లగా చీకటి ఎట్లా మాయమవుతుందో అదేవిధంగా జ్ఞానం మనసులో చేరిన వెంటనే అజ్ఞానం మాయమవుతుంది.
కనుక సత్పురుషులతో సాంగత్యం చేస్తే మంచి చెడు విచక్షణ తెలుస్తుంది. దీనివల్ల నడవడిని మంచిదారిలో పెట్టుకోవడానికి వీలుంటుంది.
పగతో పగదీరదని కృష్ణుడు కూడా అంటాడు. ఎపుడైనా పగను, శత్రువును కూడా ప్రేమతో గెలిస్తే వారిలో పగతత్వం శత్రుత్వం అనేది మొదలంటా నాశనమవుతాయి.

-పి.వి. సీతారామమూర్తి