Others

సుమధుర రామాయణం (అయోధ్యా కాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

144. అంతట నగస్త్యు డత్యాదరమ్ము తోడ
శిష్య గణముతో నెదురేగి శ్రీసమేత
యెన్ని దినముల కింత భాగ్యమ్ముగల్గె
ననుచు రాఘవు కౌగిట జేర్చుకొనియె

145. అంజలి ఘటించి నిలిచిన వారి ముపుర
నర్ఘ్య పాద్యాది విధుల నర్చించి వౌని
ధర్మమూర్తివి నిన్ను పూజించు భాగ్య
మునకు వేరొండు భాగ్యోదయమ్ము గలదె

146. కందమూల ఫలమ్ముల విందొనర్చి
తృప్తులంజేసి హర్షంబు తోడ వౌని
వజ్రఖచితము హేమ నిర్మితము దన్వు
రజత ఖడ్గము సురశిల్పి నిర్మితములు

147. రామచంద్రుని దీవించి యిచ్చె వౌని
నక్షయంబగు రెండు తూణీరములను
పద్మ సంభవాస్త్రంబు మునీశ్వరుండు
గొను మలంకారములివి నీకగునటంచు

148. రాఘవా ఈ జనకసుత మాన్య చరిత
ఈమె యిష్ట మెట్టిదటుల నడచు కొనుము
కష్టముల గణింపక నినె్న యనుసరించు
జానకి మహాపతివ్రత సచ్చరిత్ర

149. రామచంద్రుడు దారానుజులను గూడి
కలశసంభవునకు నమస్కృతు లొనర్చి
మాకిచట వాసయోగ్య ప్రదేశమేదొ
ఆనతీయుడి కృపతోడ వౌనిచంద్ర

150. ఒక తృటి నిమీలితాక్షుడై దెల్పె వౌని
రాఘవా గౌతమీ తీర మందు పంచ
వటి గలదతి ప్రశాంతము పుణ్యదంబు
నట వసింపుడు జనకజ ముదముజెంద

151. కుంభసంభవునకు మువ్వు రధిక భక్తి
వందనములిడి యాయుధంబులు ధరించి
వౌని యాదేశమున పంచవటికి పయన
మైరి తపసి దెల్పిన పథగాములౌచు

152. రెండు యోజనములు పయనించి మార్గ
మధ్యమున పితృ సఖు జటాయువుని జూచి
మధుర ఫలతరు జలపూర్ణ మడుపులున్న
రమ్యమగు పంచవటిజేరి రపుడు వారు

153. రామచంద్రుడు యోగ్య స్థలమ్ము జూప
పర్ణశాలను నిర్మించె లక్ష్మణుండు
అనుగు తమ్ముని విజ్ఞత నరసి రాము
డలఘమతి వంచు కౌగిట నలదు కొనియె

154. సీత సౌమిత్రులకు రాముడెంతొ ప్రేమ
తోడ కథలను యితిహాసములను జెప్పి
భరత శత్రుఘు్నల దలచి వారితోడ
సమ్మదమ్మున నెపుడుందు మని దలంచె

155. దినము లీరీతి సుఖముగా గడిచి జనగ
పదియు నాల్గవ యేటి ప్రారంభమందు
రావణాసురు సోదరి కామరూపి
శూర్పణఖ యనునది పంచవటిని జేరి
*

టంగుటూరి మహాలక్ష్మి