తెలంగాణ

ఎస్సీల వర్గీకరణకు ప్రభుత్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2 : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలో అఖిలపక్షంతో భేటి అయి కేంద్రంతో చర్చిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరం లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగలు కీలక పాత్ర పోషించారని, తమ డప్పు చప్పుళ్లతో కళా ప్రదర్శనలు నిర్వహించి ఉద్యమంలో ఉత్సాహన్ని నింపారన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విద్యార్థులకు సన్నబియ్యం అందించి ప్రజా సంక్షేమానికి కృషి చేసిందన్నారు. దళితుల విద్యార్థుల ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అందించామన్నారు. డప్పుకొట్టే వారికి, చర్మకారులకు 2వేల పింఛన్ కావాలని కోరడం న్యాయమైందేనన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు బాకి యాదయ్య, తప్పెళ్ల శ్రీరాములు, మేడి పాపయ్య తదితరులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ ర్యాలీతో వెళ్లి సభా ప్రాంగాణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సభా వేదికపైన మిద్దె రామనర్సయ్య బృందం ఆట, పాటలతో అందరినీ అలరించారు.

ఎమ్మార్పీఎస్ బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు అన్యాయం

తేమ యంత్రాల పనితీరుపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ అసంతృప్తి

ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 2: రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం, అధికారులు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని బిగ్‌బజార్ ఎదురుగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డుకు వెళ్లి రైతుల పరిస్థితులను, పత్తి కాంటాలను పరిశీలించారు. తేమ శాతం పరిశీలనలో అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలియజేశారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి వెంటనే తేమ యంత్రాలతో పత్తిలోని తేమ శాతాన్ని తెలుసుకున్నారు. ఇందులో యంత్రాలు రైతులకు మోసం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. అదే విధంగా పలువురు రైతులు తేమ శాతం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ధరను ఒకే విధంగా చెల్లిస్తున్నారని పేర్కొనగా ఇది రైతుకు పూర్తిగా అన్యాయమని, జిల్లాలో ఇద్దరు మంత్రులు, జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ దీనిపై దృష్టిసారించకపోవడం దురదృష్టకరమని అన్నారు. మార్కెట్‌లో రైతులకు ఒక రూపాయికే అన్నం పెడుతామని హామీలిచ్చినా కనీసం 5 రూపాయాలకు సైతం భోజనం పెట్టడం లేదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు మేల్కోని మార్కెట్‌లో రైతులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించడంతో పాటు తేమ శాతంలో అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ కార్యాలయంలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఉన్నతశ్రేణి కార్యదర్శి అడెల్లుకు సూచించారు. రైతు జెఎసి జిల్లా చైర్మన్ దారట్ల కిష్ఠు, సభ్యులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

మార్కెట్ యార్డులో తేమ యంత్రాన్ని పరిశీలిస్తున్న న్యాయమూర్తి, రైతు జెఎసి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం