జాతీయ వార్తలు

శబరిమల కేసుపై ప్రత్యేక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై సుప్రీం కోర్టు న్యాయవాదులతో ఈనెల 17న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈ కేసుపై నేడు తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా గతంలో వేసిన రివ్యూ పిటిషన్లను సమీక్షించటం లేదని, గత ధర్మాసనం వేసిన ఏడు ప్రశ్నల గురించి వాదనలు నిర్వహించనున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల ప్ర‌వేశం, ఇత‌ర మ‌తాల అంశాల గురించి ఆ స‌మావేశంలో కోర్టు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను క్రోడీక‌రించ‌నున్న‌ది. సుప్రీం ధ‌ర్మాస‌నంలో బోబ్డేతో పాటు జ‌స్టిస్ ఆర్ భానుమ‌తి, జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర‌రావు, జ‌స్టిస్ ఎం శాంత‌న‌గౌదార్‌, జ‌స్టిస్ ఎస్ అబ్దుల్ న‌జీర్‌, జ‌స్టిస్ ఆర్ఎస్ రాయ్ ది, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఉన్నారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌వ‌చ్చు అని ఇటీవ‌ల సుప్రీం తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే.