జాతీయ వార్తలు

సాధనకు తుది వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 26: శుక్రవారం కన్నుమూసిన అలనాటి బాలీవుడ్ అందాల నటి సాధన అంత్యక్రియలు శనివారం ముంబయి శివార్లలోని శాంతాక్రుజ్ స్మశాన వాటికలో జరిగాయి. అలనాటి ప్రముఖ నటీనటులు హెలెన్, సలీమ్ ఖాన్, దీప్తి నావల్, రజా మురాద్, పూనమ్ సిన్హా, తదితరులు, సాధన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయి తుది నివాళులర్పించారు. హిందీ సినిమా స్వర్ణయుగం అయిన 1960, 70 దశకాలలో అగ్రశ్రేణి నటీమణుల్లో ఒకరైన సాధన స్వల్ప అస్వస్థత అనంతరం మాహింలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
కాగా, సాధనకు తాను వీరాభిమానినని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ అంటూ ఎప్పటికీ ఆమె అభిమానిగానే ఉంటానని ట్విట్టర్‌లో అన్నారు. సాధనకు ఘనంగా నివాళి అర్పించిన ఆమీర్ ఆమె మృతి భారతీయ సినిమాకు ఓ చీకటి రోజని అంటూ, తాను బతికి ఉన్నంతకాలం సాధన అభిమానిగానే ఉంటానని తెలిపారు.