జాతీయ వార్తలు

‘హోదా’ ఇవ్వకపోతే.. తగిన శాస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి, బిజెపికి ‘సాధన కమిటీ’ అల్టిమేటం * ఏపి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ముగిసేలోపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదా ప్రకటించకపోతే అధికార తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విపరీతమైన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రత్యేక హోదా సాధన కమిటీ అల్టిమేటమ్ ఇచ్చింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కేటగిరి హోదాను పదేళ్లపాటు కొనసాగిస్తామని రాజ్యసభలో ప్రకటన చేసిన వెంకయ్య నాయుడు, మంత్రికాగానే బాణీమార్చారని, రానున్నకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టలేరని సాధన కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీఎన్జీవోలు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తులుగా మారి ఉద్యమాన్ని విస్మరించి ప్రజా నమ్మకాన్ని కోల్పోయారని ప్రత్యేక సాధన కమిటీ అధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ప్రసంగించిన వివిధ పార్టీల నాయకులు దుయ్యబట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వంలో సోమవారం ప్రత్యేక కేటగిరి సాధనకోసం ధర్నా నిర్వహించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఎం రాజ్యసభ సభ్యుడు డి రాజా, సిపిఎం రాష్ట్ర నాయకులు వై.వి.రావు, వి.శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కుప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వని పక్షంలో ఎదురయే పరిణామాలకు ప్రధాని మోదీయే భాధ్యత వహించాల్సి ఉంటుందని సురవరం చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ, విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాను తప్పించి మరెవ్వరూ కాపాడలేక పోయారన్నట్లు వ్యవహరించిన వెంకయ్య నాయుడు, ఇప్పుడు ప్రత్యేక కేటగిరి హోదా గురించి పెదవి విప్పటం లేదని విమర్శించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదాను సాధించటానికి తమ కమిటీ చేపట్టిన ఉద్యమానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్నందుకు తిగినశాస్తి అనుభవిస్తారని అన్నారు. ఆంధ్రా మేధావుల సంఘం కార్యదర్శి చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఆంధ్రకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయవలసిన నైతిక బాధ్యత తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వంపై ఉంటుందని ఆయన చెప్పారు. ప్రత్యేక కేటగిరి హోదా సాధనపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీపై అనేక ఆశలు పెంచుకున్న తెలుగువారికి నిరాశే మిగిలిందని ఆయన చెప్పారు. ప్రత్యేక ప్యాకేజి లేదా ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఆశించినవారికి ఒక చెంబుతో నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ మట్టితో బిజెపిని పాతిపెట్టి, నీటితో తర్పణం విడిచిపెట్టి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని ఆగ్రహంతో అన్నారు. లోక్‌సత్తా ప్రతినిధి మాట్లాడుతూ ఢిల్లీలో ప్రారంభించిన ఆందోళనను విస్తరింప చేస్తామని చెప్పారు. ప్రజా ఉద్యమానికి దూరంగా ఉండి రాజకీయంగా నష్టపోవద్దని పార్టీలకు హితవు చెప్పారు. (చిత్రం) ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో ధర్నా చేస్తున్న దృశ్యం