బిజినెస్

సహారా అసెట్ మేనేజ్‌మెంట్ అభ్యర్థనకు సెబి ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైసెన్సు పునరుద్ధరణకు తిరస్కృతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తమ కంపెనీకి చెందిన పోర్ట్ఫులియో మేనేజర్ లైసెన్సును పునరుద్ధరించాలన్న సహారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అభ్యర్థనను మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబి తిరస్కరించింది. ఈ వ్యాపారం కొనసాగించడానికి ఆ కంపెనీ ఏ మాత్రం తగదని సెబి స్పష్టం చేసింది. భారతీయ సెక్యూరిటీల మార్కెట్‌లో ఒక పోర్ట్ఫులియో మేనేజర్‌గా కొనసాగడానికి సహారా అసెట్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎంతమాత్రం తగదని సెబి గత ఫిబ్రవరిలో ఒక ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వును పునః పరిశీలించాలని కోరుతూ ఆ సంస్థ సెబిని ఆశ్రయించడంతో పోర్ట్ఫులియో మేనేజర్లకు సంబంధించిన అర్హతలను ఎంతమాత్రం పాటించని ఈ కంపెనీ అందుకు ఎంతమాత్రం అర్హురాలు కాదని తెలపడానికి ఏమాత్రం వెనకాడడం లేదని సెబి స్పష్టం చేసింది. ఆర్థిక నిబద్ధత, నిజాయితీ, మంచి పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిత్వంలాంటి విషయాలను సెబి పరిగణనలోకి తీసుకుందని, ఇనె్వస్టర్లను మోసగించారన్న ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్న సుబ్రతారాయ్‌కి చెందిన సహారా గ్రూపులోని కంపెనీ అయినందున ఈ కంపెనీకి అలాంటి అర్హత ఏదీ లేదని సెబి పూర్తికాలపు సభ్యుడు ఎస్ రామన్ తన 15 పేజిల ఉత్తర్వులో స్పష్టం చేసారు. ఇదిలా ఉండగా తన ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (స్కోర్స్)లో రిజిస్టర్ చేసుకోనందుకు సెబి మూడు కంపెనీలపై మొత్తం రూ. 4.5 లక్షల జరిమానా విధించింది. నిర్ణీత గడువులోగా సెబికి చెందిన స్కోర్స్‌లో రిజిస్టర్ చేసుకోలేకపోయిన బాల బెస్టోస్ ఇండియా, భార్తీయ సన్స్, అకాల్టా ట్రేడింగ్ కంపెనీపై తలా లక్షన్నర రూపాయల జరిమానా విధిస్తున్నట్లు సెబి విడివిడిగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.