Others

అతడి మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయం వేళ సూరీడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు
అలుక్కుపోయన రంగుల ఆకాశంలా
రకరకాల భావాల కలగలుపుతో
గజిబిజిగా ఉంది అతడి మనసు

ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న
ఇంద్రధనస్సు చేతికందినా
ఇంకా నడవాల్సిన దూరం
అతడిని విపరీతంగా కలవరపెడుతోంది
ఉపశమించిన కాస్త బాధతో పాటే
ఏదో తెలియని ఉక్కిరిబిక్కిరితనం ఆవహించి
ఊహించలేనంతగా
గందరగోళానికి లోనవుతోంది
యుద్ధం చేసి చేసి
చివరికి విసిగి వేసారిన సమయంలో
గురిపెట్టిన బాణం
లక్ష్యానికి తగిలిన క్షణాన
గుప్పెడు సంతోషపు చినుకులతో పాటే
అలసట మేఘం చుట్టుముట్టి
అతడిని నీరుగార్చేసింది
సాలెగూటి ఉచ్చులోంచి
ఇంకా పూర్తిగా బయటపడలేనితనం
అతడిని అయోమయపు గూట్లో
బంధించినట్టుంది
అనుకున్నది అనుకున్నట్టే
కాలయాపన లేకుండా జరిగినప్పుడు
అరచేతిలో వాలిన ఆనంపు పిట్ట
ఎన్నో యుగాల నిరీక్షణ అనంతరం
తనకు తానే భుజంపై కూర్చున్నా
మునుపు ఉన్నంత ఉత్సాహమంతా ఆవిరై
అలా నీరసపరుస్తుందేమో
అతడి మానసిక స్థితి
ఇప్పుడు అలాగే ఉన్నట్టుంది

- పద్మావతి రాంభక్త, 9966307777