Others

వాకిట్లో వటవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా వాకిట్లో వున్న వటవృక్షం
చీకట్లో వెలుగులు చిమ్ముతుంది
వెనె్నల్లో వనె్నలు చిగురిస్తుంది
కనె్నపిల్లలా గారాలు పోతుంది
కన్నతల్లిలా కరుణ కురుస్తుంది

మా వాకిట్లో వటవృక్షం
వీణలు శృతి చేస్తుంది
గలగల సవ్వడులతో మువ్వలు కదిలిస్తుంది
దిగంతాల నాహ్వానిస్తూ రెక్కలు పరుచుకునుంది
నింగిన పారాడే మబ్బులతో
గుసగుసలు పోతుంది
కళ్లల్లోకి మెరుపుటద్దాలు పరావర్తిస్తుంది
ఒళ్లంతా చల్లని పవనాలతో పులకింపజేస్తుంది
మా వాకిట్లో వటవృక్షం
ఆశ్రయ కల్పతరువైంది
చిటారు కొమ్మల నిండా కాకమ్మ గూళ్ళు
గుబురు గుబురుల్లో గువ్వల కబుర్లు
రెమ్మలతో ఊయలలూగే చిలుకమ్మ తుళ్లింతలు
గాలితో ఊగిసలాడే గిజిగాడి గిరికీలు
మా వాకిట్లో వటవృక్షం ఋతుకేళీ విలాసమైంది
శిశిరంలో అరుణారుణ కేతనాలు ఎగరేస్తుంది
వసంతంలో వనకన్య పారాణై పరవశిస్తుంది
గ్రీష్మంలో దీపమాలికల
వత్తుల గుత్తులతో స్వాగతిస్తుంది
వర్షంలో ఆవరణంతా పరచుకుని
ఛత్రంగా మారుతుంది
నా వాకిట వటవృక్షం హిమనగమై నవ్వుతోంది
పురాతత్త్వం పురుడు పోసుకున్న గర్భకుహర
పొరలను నిండుగా కప్పుకున్న పెద్దముతె్తైదువు
జరామరణాలకతీతంగా కరిగిపోయన
కాలాన్ని మోసుకొస్తున్న
వర్తమాన భవితవ్యపు సేతువు1
పగటి ఎండలో తళుకు బెళుకులు
మెరుస్తున్న ఆశల నీడల పొదరిల్లు
రాత్రి జలజలా జాలువారే
తారా మణిహారాల జలతారు హరివిల్లు
మా వాకిట వటవృక్షం
పచ్చదనం చుట్టుకున్న మానవ వేదం!

-- బి.ఎస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199