Others

రుధిర వస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొట్టుబొట్టుగా కారుతోంది నెత్తురు
ఆ వస్త్రం రుధిర నదిలో ముద్దయ్య
పాదాల మీదుగా లోహ చెప్పుల మీదుగా
రక్త బిందువులను నేలపైకి రాలుస్తోంది

దారంతా
ముక్కలైన ప్రశ్నలు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాయ్
తెగిపడ్డ చూపుడు వేళ్ళు ఇంకా ఎత్తే నిల్చున్నాయ్
చితికిన పిడికిళ్లు... గుప్పిట్లో జనస్వామ్యాన్ని
ఒడిసి పట్టుకునే ఉన్నాయ్
మూతి పగిలినా.. గొంతు నలిగినా...
అక్షరమై మండుతూనే ఉన్నాయ్

ప్రశ్నల్నీ పిడికిలినీ
గొంతుల్నీ వేళ్లనీ.. కొన్ని పువ్వుల్ని
ఫాసిస్టు చక్రాలు తొక్కి తెంపిన నరాల ఏరులో
ఆ గుడ్డ తడిసింది!

ఈ పాపం
నడిచిన పాదాలదీ
అణచిన పాదరక్షలదే కాదు
కొంచెం
ఎరుపు పీల్చిన వస్త్రం అసలు రంగుది కూడా!
అయనా పుటల్లో పువ్వులై
అడుగుల్లో శాపవౌతుంటే
ఏ వర్ణానికని ఈ మరకలు అన్వయస్తాం?

అందుకే రంగు పులమని ఓ జెండా
మనిషితనానికి ప్రతీకగా
ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి
మనసుల్లో వర్ణాలను విదిలిస్తూ
రెపరెపలాడుతూనే ఉండాలి

ఇప్పుడు
తునకలైన ప్రశ్నల్నీ పిడికిళ్లనీ
చట్టం చక్రాల్లో నలుగుతున్న
స్వేచ్ఛాక్షరాలతో కలుపుతూ
మరో చూపుడువేలును తయారుచేసి
పైకెత్తి చూపాలి
నల్లమబ్బుల్లో నిద్రిస్తున్న కళ్లను
మబ్బు తెరలను తొలగించి
నలిగిన ప్రశ్నలకు చూపించాలి
ఇక మరిన్ని ప్రశ్నలనూ
మరెన్నో వేళ్లనూ తయారుచేయాలి

- శ్రీవశిష్ట సోమేపల్లి, 9966460536