Others

పట్టాలెక్కని బండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీతాల్లో లింగభేదాలున్నట్టే
ఉద్యోగులలోనూ ఒప్పంద భేదాలుంటాయ
చట్టాలు వాటి దారిన అవి వెళ్తుంటాయ
ఆడకూలీలనూ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులనూ
తప్పించుకుని తిరుగుతాయ
సమానమైన పనికి సమాన వేతనం -
అంటూ ధర్మపన్నాలు వల్లించే
సమాన ప్రతిఫల చట్టం
ఈ అసమ సమాజం అడుతున్న బూటకం
సంజయ రాజ్యంలో
ప్రజాస్వామ్య వలువలు ఒలుస్తూ
ఎర్ర శాలువలా కప్పుకునేందుకు
తెరపైకి తెచ్చిందే ఈ దుశ్శాసనం
అపు పడే రెప్పపాటులో మన గణతంత్రం
సమసమాజమైపోవడం
ఇందిరానుకూల చరిత్ర నిండిన ‘కాళనాళిక’లాగే
ఈ ముదనష్టాన్నీ భూగర్భంలో నిక్షిప్తం చేశారు నాడే
అందుకే నోట్లో నాలుక లేనట్టుంటారు ఈ వ్యవహారంలో సంఘజీవులు
చెవిలో దూది తియ్యనే తీయరు ఏలినవారు
కళ్లగంతలు విప్పనే విప్పవు న్యాయ నెలవులు

ఇక సామాన్యులే నడుం బిగించాలి
నిద్ర నటిస్తున్న నలుగురు బాధ్యుల్నీ నిలదియ్యాలి
ఈ బండిని పట్టాలెక్కిద్దాం పదండి
తలో చెయ్యా వెయ్యండి

- మల్లాప్రగడ రామారావు, 9989863398