సాహితి

తప్పుల్ని ఎత్తిచూపే బాధ్యత అందరిదీ (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తెలుగు భాషకు బ్రహ్మరథం’’అన్న శీర్షిక సాహితీలో చూచి ఇక మళ్ళీ కొత్తగా ‘‘బ్రహ్మరథం’’కట్టిన (పాడె) మహానుభావుడెవరు, మహాప్రభో అని అనుకుంటూ చదివేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. సాంకేతిక రంగంలోని పదాలను అనువదించినా అవి పత్రికలకే పరిమితం అయ్యాయే తప్ప వాడుక భాషలోనికి రాలేదు. ఒకవేళ వాటిని వాడినా అదేదో జంధ్యాలగారి సినిమాలో కోట శ్రీనివాసరావుగారి భాష లాగా ‘‘నిశివర్ణ ఉషోదకము’’ అదియును తెలియదా? తమ పిండము. దానిని ‘‘కాఫీ’’అందురు. అన్నంత వ్యంగ్యంగా నవ్వులాటగా వినబడుతూ ఉన్నదే తప్ప భాషలో కలిసిపోలేదు సాంకేతిక పదాలు యథాతథంగానే అర్థం అవుతూ ఉండగా అనువాదం ఎవరికోసం చేస్తూ ఉన్నారు? పారిభాషిక పదాలు నేటి పామరులకు సైతం అర్థంఅవుతూ ఉన్నాయి కదా! పోతే ఉచ్చారణలో తేడా ఉండవచ్చు.
ఇక పెద్దన్న పత్రికలో చేసే పదప్రయోగాలను సేకరించి ఉంచితే తెలుగులోని సమస్త నిఘంటువులంత పెద్దపెద్ద పుస్తకాలవుతాయి. ఆ భాష చదివితే తెలుగు వెలుగుతూ ఉందా? కొడిగట్టి కొండెక్కటానికి సిద్ధంగా ఉందా? అన్న సంశయం కలుగక మానదు- పేదలకు పెద్ద ఉపకారం చేయదలచిన ధర్మ ప్రభువులు కేవలం రూ.2000లకే నెలసరి సరుకులు అందజేస్తారట తమ దుకాణంలో. మహిళల ఋతుస్రావానికి ఆ పదం ఎప్పుడో స్థిరపడిపోయింది. ముఖ పుస్తకంలో ముందు పళ్ళు ఊడేలాగా మూతి పగలగొట్టేసరికి మరుసటిరోజే ‘‘నెలవారి సరకులు’’అన్న పదం వచ్చింది. ఇలాటి తప్పుల్ని ఎత్తిచూపే బాధ్యత పెద్దలకేకాదు ప్రతి పాఠకుడికి ఉంది. రేట్లకు డాక్టరేట్లు అందుకునే పెద్దలకు (అందరూ కాదు సుమా!) భాష విషయం పట్టకపోవటంలో వింత లేదు కదా!

- ఆయి కమలమ్మ, కె.రాధాప్రసాద్‌శర్మ