సాహితి

మాయామోహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుఃఖం నిండిన బ్రతుకులోంచి
హృదయాన్ని దూరంగా విసరడం
ఇప్పటికీ సాధ్యపడలేదు
వర్ణాలు విరిగిపోయిన స్వప్నంలోంచి
కలల్ని కంటిరెప్పల మీద గుచ్చుకుని
నిర్భయంగా తిరగడం కుదరడం లేదు

ఒక పూర్ణ చిత్ర సంభాషణ తెగాక
రహస్య నిద్రని గిరాటు వేశాక
పోరాడి అలసిపోయిన హృదయ ఓదార్పుకి
జీవశిల్పపు ప్రాణతంత్రిని చుట్టి
కాపాడుకోవడమెలాగో నేర్చుకోనూ లేదు

ప్రేమంటే ఎంతటి మాయామోహనం!
ప్రేమలో ఓడిపోవడం అంటే
ఉన్నట్టుండి అతి రహస్యంగా
నిష్క్రమించడమేనేమో
దేహపు గూడు పునాదులు కదిలి
అవిశ్రాంత స్వప్నాలు పగిలి
శిథిలాల మీద నగ్నపాదాలతో నడుస్తూ
వెళ్తున్నప్పటి బాధే ఈ ప్రేమ

ముందూ వెనుకా దుఃఖమే ఉన్నప్పుడు
మధ్యనున్న దేహం ఎటూ కదలని స్థితి
ప్రేమించిన హృదయాలన్నీ
హఠాత్తుగా శాపానికి గురై
గాజుబొమ్మల్లా మారిపోయాక
రంగుల ఇంద్రధనస్సు మీద తలవాల్చి
వౌనంగా ముక్కలవ్వాల్సిందే
మృత్యువు పువ్వుని ముద్దాడి
యాతనల మాలని చుట్టుకుని
నవ్వుతూ నిష్క్రమించాల్సిందేనేమో

నువ్వుంటేనే ఈ హృదయాన్ని
ప్రాణశిల అంటాం
నువ్వెళ్ళిపోయాక... దగ్ధమయ్యాక
మనసు శాపవృత్తంలోని బందీయేకదా.

- ఖాదర్ షరీఫ్ 9441938140