సాహితి

పదబంధాలతో తెలుగు వెలిగేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

........................
ధ్వనికి తగిన లిపి సంకేతాలను సంస్కరించి ఏర్పరచుకొన్న భాష తెలుగు.
అనవసర లిపి సంకేతాలు లేవు. లిపి సంకేతాలను ఎన్నిసార్లు వాడగలమన్న దానికన్నా ఎంత స్పష్టంగా ఉచ్చరించగలుగుతున్నామన్న అంశానికే ప్రాధాన్యత.
.........................

యం.వి.ఆర్.శాస్ర్తీగారి ‘్భషకు బ్రహ్మరథం’ (11-4-16) వ్యాసానికి ప్రతిస్పందనగా తెలిదేవర భానుమూర్తి, వి.చెంచయ్య స్పందించారు. వాటికి నా ప్రతిస్పందన ఇది.
లబ్ధప్రతిష్ఠులయిన తెలిదేవర భానుమూర్తి భాషాధ్యయనం చేసినవారే కాక పలు శీర్షికలు నిర్వహించిన వారు కూడా అవటం చేత ‘బహ్మరథం’ అనే పదం నిఘంటువు ఇచ్చిన అర్థానికి వ్యతిరేకంగా ఎలా మారిందన్న అంశాన్ని చక్కగా విశదీకరించారు. ఒత్తుల వద్దే కుత్తుక పట్టుకుంటుంది మన తెలుగు భాష. పాఠకులు సులువుగా గుర్తుంచుకోవటానికి వీలుగా క్లుప్తంగా మూడంటే మూడే వాక్యాలతో చక్కగా తెలియబరిచారు. పరిహాసార్థంలో లేదా నిమ్నార్థంలో పండితులే కాదు, పామరులు సైతం వాడే పదాలు చాలానే ఉన్నాయి. ఉదా: శఠగోపం, కైంకర్యం, పంగనామాలు, పులికాపు, నైవేద్యం, భోక్త, చతుర్ముఖ పారాయణం మొదలైనవి. మనస్ఫూర్తిగా ఆహ్వానించే ‘దయచేయండి’ అనే పదాన్ని స్వర మార్పుతో ‘బయటికి నడవండి’ అనే అర్థం స్ఫురింపజేయడం కూడా తెలుగుకే చెల్లింది.
నా పుట్టిల్లయిన నంద్యాలలో ‘దొంగిలించు’ అన్న పదాన్ని పరమ బూతుపదంగా ఉచ్చరిస్తారు. అయితే దురుద్దేశంతో మాత్రం కాదు. తిరుమల రామచంద్ర గారి ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ చదివేటప్పుడు ఓత్వ చిహ్నంతో రెండు భాగాలున్నాయని, అవి ‘ణ’, ‘మ’, ‘య’ అక్షరాల మీద వ్రాయటానికి ఆశువుగా లేకపోవడం చేత ఏత్వం, కొమ్ముదీర్ఘం ఇస్తారని తెలియజేశారు. ఒక పాత దస్తావేజులో ‘ఓత్వం’ ఉన్న ప్రతి అక్షరాన్ని ఏత్వం, కొమ్ముదీర్ఘంతోనే రాశారు. చదువరులు పొరబాటున ఏత్వం మాత్రమే ఉచ్చరించటం వలన అశ్లీల ఉచ్చారణ వచ్చి ఉండవచ్చని ఊహించాను. ‘తెలిదేవర’ గారి గృహనామం కూడా ‘తొలిదేవర’ (బ్రహ్మ) కావచ్చని అనుకుంటున్నాను. ఈ అంశాన్ని వారు చదివితే నా సంశయాన్ని తీర్చవలసినదిగా మనవి చేసుకుంటున్నాను. ఇక ఈ వారం (24-4-16) వి.చెంచయ్యగారి వ్యాసం చదివితే పొట్టేలు ఎవరెస్టు శిఖరాన్ని ఢీకొట్టినట్లు ఉంది. నాలుగు శతాబ్దాలుగా పత్రికా రంగంలో ఉంటున్న యం.వి.ఆర్.శాస్ర్తీగారికి భాషా శాస్త్రంలో అర్థ పరిణామము అన్న ఒక చిన్న అంశం ఉంటుందని తెలియదా? చెంచయ్యగారు వివరించిన అంశాలన్నీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బోధించినట్లుంది. విమర్శించేటప్పుడు ఎదుటివారి స్థాయిని కూడా దృష్టిలో ఉంచుకోవడం ఒక ముఖ్యమైన అంశం.
అర సున్నకు ఉచ్చారణే లేదని అతి తేలికగా తేల్చినారు. లేదని ఎవరు చెప్పారు? ఎందుకు లేదని చెప్పారు? ఎందుకు వాడటం లేదు? అన్న సందేహం పాఠకులకు కలిగితే దానిని నిరూపించవలసిన బాధ్యత కూడా ఒక సద్విమర్శకుడిగా మీమీదే ఉంటుంది. భాషా పరిశోధకులకు భగవద్గీత అనదగ్గ ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ అన్న ఒక పుస్తకాన్ని 1957లో తిరుమల రామచంద్రగారు రచించారు. అందులో (167 పుట) దాదాపు 300 ఏళ్ల క్రితం దాకా (ప్రస్తుతం అయితే 359 సం.) అచ్చంగా మీరు చెప్పినట్లే మన భాషలో అరసున్నలే లేవు అని తేల్చినారు. అయితే ఉచ్చారణ అనుస్వారానికి భిన్నంగా ముక్కుతో తేల్చి పలికే విధంగా ఉంటుందని చెప్పారు. ‘అరసున్న ఒకప్పుడు భాషలో ఉండి కాలక్రమంలో అనునాసిక స్వరాల జ్ఞాపక చిహ్నంగా అర్ధాంతరంగా పుట్టుకొని వచ్చింది’ అని అంటారు. ‘హిందీ, మరాఠీ సాహిత్య సాంగత్యాల వలన మనకు సంక్రమించి ఉండవచ్చని నా భావన’ అని కూడా అన్నారు.
ఇక శకట, సాధురేఫల వాడకంలో నియమాలేవీ లేవని ఒక నిర్ధారణకు వచ్చేసి అపెండిసెక్టమీ చేసి అపెండిక్స్‌ను తొలగించినంత సులువుగా తీసేసినామని చెప్పినారు. అయితే, తిరుమల రామచంద్రగారు సేకరించిన వాస్తవాలను గమనించండి. ‘నేడు ‘ర’, ‘ఱ’ల ఉచ్చారణ ఒకటే అయిపోయింది. కాని పూర్వం భిన్నోచ్చారణ ఉండేది కనుకనే విడివిడి అక్షరాలు పుట్టాయి’ అని తెలియజేసి, ‘అంతేకాక ఒకదానికొకటి రాయకుండా’ రేఫ ‘ఱ’కార సీసమాలిక’, ‘ద్విరేఫ వర్గ దర్పణము’, ‘రేఫ ‘ఱ’ కార నిర్ణయము’ వంటి శాస్త్ర గ్రంథాలు బయలుదేరాయి. వీటిలో రేఫ ‘ఱ’కారలున్న పదాల జాబితాలు విడివిడిగా ఉంటాయి’ అని వివరణ ఇచ్చారు. ధ్వనికి తగిన లిపి సంకేతాలను సంస్కరించి ఏర్పరచుకొన్న భాష తెలుగు. అనవసర లిపి సంకేతాలు లేవు. లిపి సంకేతాలను ఎన్నిసార్లు వాడగలమన్న దానికన్నా ఎంత స్పష్టంగా ఉచ్చరించగలుగుతూ ఉన్నామన్న అంశానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచ భాషలన్నింటిలోనూ సంస్కృత పదాలు వికృత రూపంలో ఉన్నాయని పండితులందరూ తేల్చిన అంశమే. అది మరచి ఒకప్పుడు తెలుగులో సంస్కృత పదాలు సగానికి పైగా చేరినప్పుడు ఏమంటారు? అని నిలదీశారు. మన దేశ భాష మన తెలుగులో కలిసిపోవడంలో వింత ఏముంది? పరాయి భాష అయిన అంగ్లం మన నెత్తినెక్కి సవారీ చేస్తే లేని అభ్యంతరం సంస్కృతానికెందుకు? ఆంగ్లం 'leading language' అని అన్నారు బూధరాజు రాధాకృష్ణ గారు - ‘తెలుగు మాత్రమే తెలిసినవారు రెండవ శ్రేణికి చెందినవారే’నని అంటారు రాజాజీగారు. తెలుగు భాషలో ప్రసిద్ధి చెందినవారందరూ సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో ప్రవీణులే. పత్రికలలో ఆంగ్ల భాషను నిరసించేవారే అయితే ‘సాక్షి’ పేరుతో స్వయంగా ఎడిటర్‌గారే నిర్వహించే శీర్షికకు ‘వీక్‌పాయింట్’ అన్న శే్లషార్థంతో ఆంగ్లంలో పేరు పెట్టగలరా? వెనకటి రోజుల్లోని సంస్కృతం సంగతి అలా ఉంచండి. మీరు (చెంచయ్య) వెలువరించిన వ్యాసంలో మచ్చుకు కేవలం మొదటి పేరాలో పదాలనే చూడండి. భాష, దుర్గతి, ఆవేదన, వ్యక్తం, నవతరం, వ్యాకరణం, నియమం, ప్రమాణం, శైలి, శాస్త్రం, జడపదార్థం, అవసరం, సంప్రదాయం, ప్రామాణికత, అనివార్యం, సమాజం, పరిశీలన, ఔచిత్యం, అర్థం, కారణాలు వంటి పదాలన్నీ సంస్కృత పదాలు కావని వాడారా? ఔనన్నది మీ జవాబయితే తప్పు అనకతప్పదు. అచ్చ తెలుగే అని అడ్డగోలుగా వాదించి సామాన్య పాఠకురాలనయిన నా నోరు మూయించినా పండితులంతా దుడ్డుకర్రలతో వస్తారు.
తెలుగు భాషా భారతిని జ్ఞానపీఠం మీద ప్రతిష్ఠించిన కవిసమ్రాట్ విశ్వనాథ వంటివారికి తెలుగులో నూటికి నూరు మార్కులు రాలేదు. పట్టుమని పది వాక్యాలు తప్పుల్లేకుండా రాయలేని నేటి విద్యార్థులకు తెలుగులో వంద మార్కులు రాలేదని తెలుగును వెలిగించే భారాన్ని తన భుజాలమీద మోస్తున్న మోతుబరి పత్రికలో ‘‘్భషకు దక్కని ‘వంద’నం’’ అని వందని ఇన్వర్టెడ్ కామాలలో ఇరికించి కవిత్వం ఒలకబోసింది. అంతేనా! పచ్చ‘్ధనం’, ‘్ధగ ధగాఖానాలు’, భీ‘కరువు’, ‘పగుళ్ళతో జల చిగుళ్ళు, ఏక విపణి, లాతూర్ జలకంపం - వంటి కొత్త పదబంధాలను సృష్టించారు వీరఘటోత్కచుని ప్రశిష్యవర్గం. తమ కామందుకు పద్మభూషణ్ దక్కిందని ‘పద్మాభిషేకం’ చేసిన ఘనాపాఠీలు. అదనపు నైపుణ్యాలు కొరవడి ఐటి ఉద్యోగాలు దక్కించుకోలేని వెర్రిబాగుల వారి కోసం విభక్తి ప్రత్యయాలు వాడటం చేతకాని వెర్రివెంగళప్పల విచిత్ర పదబంధం ‘ఐటీ కొలువర్రీ’, ‘జయహో జలధితరంగా’ ఇందులో ‘జల’కు అటూ ఇటూ ఎరుపు, ‘జల’ పదానికి నీలిరంగు పులిమి తమ సృజనాత్మకతకు తామే మురిసిపోయారు. ఇన్ఫోసిస్ లాభాలు తెలియబరచే మర్మి పదబంధం ‘ఇన్ఫి ధనాధన్’ ఈ పత్రికాధినేత అడుగు జాడలోనే నడిచే మరో పత్రికారాజము ‘్ధర’ఖాస్తుతో దడదడ, ‘అబ్భానుడు’ (మండిపడే సూర్యుడన్నమాట), ‘అధికార్మిక సేవ’ వంటి పదాలకు పురుడు పోసింది.
ఈ ఘనత వహించిన పత్రికలలోని భాషనే నేటి యువతరానికి ప్రమాణము. ఇలాంటి చిత్ర విచిత్ర పదబంధాలతో తెలుగు భాషను పరిపుష్టం చేస్తున్నాయా? పాతిపెడుతున్నాయా? ఇవి తెలుగును వెలిగించే పత్రికలా? మండించే పత్రికలా?

- ఆయి కమలమ్మ