సాహితి

ఉన్న పదాలతో మాట్లాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాష బతికి బట్టకట్టాలనే కోరిక, ఆరాటం భాషని ప్రేమించే వాళ్ళకందరికీ వుంటుంది. తెలివిలేనివాడు కూడా ఒకోసారి మంచి సలహాలు ఇవ్వగలడట. భాషా జ్ఞానం అంతగా లేని నాకూ ఏదో ఉడతా భక్తిగా ఏదో చెప్పాలనే ఉబలాటం.
మనం తెల్గూస్. మనం మాట్లాడేది ‘టెల్గు’- ‘తెంగ్లిష్’- ‘తెలుగిష్’ అని స్వయం నిందారోపణలు చేసుకొంటూ బతికేస్తున్నాము, ప్రయత్న శూన్యంగా!
కొత్త పదాలను నాలుగు సృష్టించి భాషా సేవ చేస్తున్నాం అనుకొంటే పొరబాటే. ఎందుకంటే- భాష కావ్యాలలో, పుస్తకాలలో ఇపుడూ ఎపుడూ చక్కగా కవులు, పండితులచే నిక్షిప్తం చేయబడుతోంది. పాఠ్యపుస్తకాలు వ్రాసేటపుడు రచయితలూ జాగ్రత్తపడతారు. ఎటొచ్చీ నేడు దైనందిన జీవితంలో మనం వాడే వ్యవహారిక భాషే ఇంగ్లీష్ మరియు సాంకేతిక అభివృద్ధితో వృద్ధి చెందిన కొత్త పరభాషా పదాల సునామీ ధాటికి నిలువలేక రెపరెపలాడుతోంది. ప్రజల నాలుక మీద నానుతున్న వాడుక భాషకే నేడు తెలుగుకి పట్టిన ఘోష.
దీనికి కారణం తెలుగు భాషకి మన చదువుల్లో ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఇంటింటా భాషాభిమానం లేక భాషను బ్రతికించే ప్రయత్నం ఏమాత్రం చేయక పోవడం, ఇంగ్లీష్ పదాలు ఫ్రీగా- ఈజీగా కలిపేసుకొంటూ గొప్పగా ‘్ఫలై’పోవడం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి వహించటం కూడా కారణాలే కదా. నేటి విద్యావ్యవస్థలో తెలుగు ‘టీచర్’ ముఖ్య పాత్ర వహించలేకపోవడం కూడా కద్దు. కాసేపు మూలాలకి వెళ్దాం, ఉదాహరణలతో- బడి, గురువు, ఉపాధ్యాయుడు, అయ్యవారు పదాలు వాడకం మానేసి చాలా కాలం అయ్యింది. ఇపుడు ‘స్కూలు’- ‘టీచర్’- ‘సార్’ వాటి స్థానంలో చేరాయి. ఇళ్ళల్లో అమ్మ, నాన్న, బాబాయి, మామ పదాలు వినబడడం లేదు కదా. మమీ, డాడీ, అంకుల్, ఆంటీ పదాలు నెత్తికి ఎక్కి కూచున్నాయా లేదా?
నా మిత్రుడు ఒకడు ‘పెళ్ళి’ ఎలా వ్రాయాలి? ‘పెళ్లి’ అనా, ‘పెళ్ళి’అనా? ఏది సరైనది, చర్చకి తెరలేపాడు. అది భాష వచ్చి, వ్రాయడానికి పూనుకొనే వారికి!
ఈ రోజుల్లో ‘‘నేను మిత్రుడి పెండ్లికి వెళ్లి వచ్చాను’’ అని ఎవరు అంటున్నారు? ‘నా ఫ్రెండ్ మారేజ్ అటెండ్ అయి వచ్చా!’ అంటున్నారు. - కాదు, అలా అనడానికి మన వాళ్ళు ‘డిసైడ’య్యారు. ఇదొక జబ్బు మనకి. ఇంగ్లీషు పదాలని ‘ఫ్రీ’గా అతికించేస్తాం.
ఉదా: నన్ను ఫ్రెండ్‌గా యాడ్ చేసుకోండి. నిన్న మీటింగ్ మిస్సయ్యాను. మీరు కూడా ఇంట్లో ట్రైచేయండి. రేపు ఈవెనింగ్ నీతో టైం స్పెండ్ చేస్తాను. లాంటివి. చివరికి ఏమీ చదువుకొని మా పనిమనిషి కూడా ‘‘నైట్ నాకు నిద్దర లేదు’’ అంటుంది. ఇక ఎంచక్కా ‘‘నేను గృహలక్ష్మి’’ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. లేదా ‘గృహిణి’ అని సాదాసీదాగా అనొచ్చు వనితలు. అదేం చిత్రమో అందరూ ‘నేను హౌజ్‌వైఫ్’ అని అనేస్తారు. మనం తెలుగు భాష పరిస్థితి మీద వ్యాసం వ్రాయాలనుకొన్నపుడు మాత్రం మడికట్టుకొన్నట్లు ‘ఆంగ్లము’ అంటాం. ఇంతెందుకు- ‘సంపాదకుడు’- ‘రచయిత’ అనే పదాలని కూడా నిత్య వాడుక భాషలో మన నాలుకల మీద నుంచి తప్పుకొంటున్నట్లు కనపడుతోంది.- ‘ఎడిటర్’- రైటర్ అని వినబడటం బాధాకరం. చెప్పుకొంటూ పోతే, చెంతాడంత అవుతుంది ఈ పట్టిక. మనకంటే మన పొరుగు రాష్ట్రాలవాళ్ళు చాలా మేలు. ప్రపంచంలో గూగుల్ యెంత పెద్ద దిగ్గజమైనా- కర్ణాటకలో మాత్రం ‘గూగులో’ అని బోర్డ్ అని వ్రాసుకోవాల్సిందే.
తమిళనాట మనలా ‘్థంక్స్’ అనరు. శుభ్రంగా పెద్ద హోదాలో వున్న వ్యక్తినుండి కూలీ వరకు అందరూ ‘నన్రి’ అనే అంటారు. మనకూ ‘కృతజ్ఞతలు’ ‘్ధన్యవాదాలు’ అనే పదాలు వున్నాయి. ఎంతమంది నోటితో ఆ పదాలు ఉచ్చరిస్తున్నాం? థాంక్స్ అనడం మనకు ‘ఈజీ’- కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనే పదాలు వాడడానికి మనం ‘్ఫలై’పోతాం అన్నది నా భావన. వాడుక భాష, నాలిక మీద నడయాడే పదాలు అచ్చంగా తెలుగు లేదా సంస్కృత పదాలు- మనకు వున్నవి- మనం మరచిపోతున్నవి వాడడం బాగా అలవాటులోకి తెచ్చుకోవడం మనం మొదట చేయాల్సిన పని. ఇది ఎవరి పని? అంటే- ఇంట్లో అమ్మల పని, నాన్నల బాధ్యత. ఇక బడిలో ఉపాధ్యాయుల వంతు. సంఘంలో భాషాభిమానుల పని. ప్రభుత్వం ఇకనైనా మేల్కొనకపోతే తెలుగు వెలగదు. చీకటి గదిలోనే మూలుగుతూ వుంటుంది.
ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి- బోర్డుకి ‘నామపత్రము’ అని పదం కనిపెట్టినా అది వాడుకలో నాలుక మీదకి రావడం కష్టం. మనం మొదటిగా ‘డిసైడయ్యాను, షుగర్ యాడ్ చేసుకోండి, థింక్ చేయలేదు, ట్రై చేస్తా,.... లాంటివి మానుకొని, వాటి స్థానంలో ‘అనుకొన్నాను’ ‘నిర్ణయించుకొన్నాను’ ‘చక్కెర కలుపుకోండి.’ ‘ఆలోచిస్తాను’ ‘ప్రయత్నిస్తాను’.... అని ప్రతి ఒక్కరం ఇకనైనా తియ్యటి తెలుగు పదాలు వాడుకొందామా!!
‘‘ప్రయత్నం నాతోనే మొదలు’’ అని గట్టిగా అనుకొంటే భాషాభిమానం మనమూ పెంచుకోగలుగుతాం!!

- బివిఎస్ ప్రసాద్, 9949944006