సాహితి

సాగే జన లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావాలు చిలుకలై నక్షత్రాకాశంలో
తేలియాడుతున్నాయి
అక్షరాలు పదాలై మాలూలాభరణాలై
భావాలు భాస్వరాలైతయ్
పూలమరిమళాలైతయ్
బ్రతుకు సుగంధాల తోటలో విరబూస్తాయ్
నిశీధి వేళ వెలుగే నక్షత్రకాంతల నవ్వులు కదా
అవెప్పుడూ పగలు అదృశ్య లోకంలో సేదదీరుతాయి
రాత్రిని వెలిగించే రేరాజు చుట్టూరా చేరి
ముచ్చట్ల సరదాలతో కాలాన్ని కరిగిస్తాయి
వేకువజాము అయితే చాలు కుర్చీలు, చాపలు
సర్దుకొని అదృశ్య లోకంలోకి సాగేను
రోజుకొక సరికొత్త వెలుగు కిరణాల జడిలో
సరికొత్త జీవనం పోసుకున్న ప్రపంచంలో
ఆ నక్షత్రాలే వేళకు విధి నిర్వహణలో హాజరు
పగలు అదే నిత్య ప్రభాత వెలుగు లోకం
రాత్రయితే సదా చుక్కల వెనె్నల చంద్రలోకం
ఈ రెండింటి నడుమ సాగేది జన వ్యవహార లోకం
యుగయుగాలుగా అనాదినుండి అనంతం దాకా
ఇది కాలగమన లోక చక్రం సహజ చిత్రం

- సిహెచ్ ఆంజనేయులు, 7702537453