సాహితి

గణితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నట్టుండి టెలివిజన్ సెట్‌లో
రంగులు వెలిసిపోయినట్టనిపిస్తుంది

మోజుపడి కొనుక్కున్న కొత్త బైక్
ఇంటిముందు పార్క్ చేసినప్పుడు
దర్జా చూపుతుంది గానీ
చెల్లించాల్సిన ఇఎంఐలు
కళ్ళ ముందు కనిపించి భయపెడతాయి

వడదెబ్బకి వృద్ధ బంధువొకరు
ప్రాణం విడిచినప్పుడు
తప్పని వేసవి ప్రయాణానికి
చేసిన అప్పులు వొక్కచోట నిలువనీయవు

సూపర్ మార్కెట్‌లో ఆకట్టుకున్న
వస్తువులు, సరుకుల జాబితా
పెరిగి పెరిగి బిల్లు కట్టలేని స్థాయికి చేరి
అప్పు కోసం షాపువాడిని అర్థించినప్పుడు
గుండె కొట్టుకొనే వేగం తగ్గుతుంది

బారువడ్డీ చక్రవడ్డీల చిక్కు లెక్కలు
చిన్నప్పుడే సౌకర్యంగా మర్చిపోయామనుకునే
వేతన జీవికి జీవితం
నెలనెలా కఠినమైన లెక్కల పరీక్ష పెడుతుంది

- తురాయి మురళీధర్, 8897465104