సాహితి

ఇల్లు ఇల్లులా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలిగిన ఇల్లాలు
పిల్లలతో పుట్టింటికెళ్లిపోయినట్టు
ఇల్లు ఇల్లులా లేదు
అమ్మ చిరునవ్వులా మెరిసిన ఇల్లు
చుట్టూ పచ్చరంగు చల్లుకుని
మొక్కల నడుమ మొలిచినట్టుండే ఇల్లు
ఇల్లులా లేదు
లాల పోసి లాలించి
తులసి ముఖాన తడిబొట్టు పెట్టి,
నిత్య వసంతంలా
బంతులూ, చేమంతుల అలికిడి పూయించి
కరివేపాకు చెట్టుకొమ్మల్లో
ఘుమఘుమల చిగురు మాటలు పలికించి,
చిక్కుడూ, దొండ పాదుల
జంట కవిత్వం పాడించిన
ఆడ చేతులు
వేన్నీళ్లకు చన్నీళ్లులా
బ్రతుకు బాటలో పని మీదేసుకుని వెళ్తుంటే
చిట్టి చాటంత వ్యవసాయ క్షేత్రం
ఎడారి పంటయ్యి
ఇల్లు ఇల్లులా లేదు
పొద్దునే్న, సూర్యుడు ఇంట్లో పడకుండా
తలుపులు మూసే
యాంత్రిక సూత్ర రాగమెత్తుకుని
శ్రామిక లోకంలోకి
రాణీ చీమ కూడా వెళ్లాక
ఇప్పుడు
ఇల్లు ఇల్లులా లేదు.

- గజ్జెల రామక్రిష్ణ 8977412795